header

Penugonda Fort

Penugonda Fort / పెనుగొండ కోట
అనంతపురం జిల్లాలో చిన్నపట్టణం పెనుగొండ, పెనుగొండకోట చూడదగినది మరియు సుప్రసిద్ధ నిర్మాణం. ఇది విజయనగర రాజులచే కట్టబడినది. మరియు విజయనగర రాజుల రెండవ రాజధానిగా ప్రసిద్ధి చెందినది. ఈ కోట రాయి, సున్నం మరియు మట్టితో శతృదుర్భేద్యంగా నిర్మించబడినది. ప్రస్తుతం పెనుగొండ కోటలో రెండు ప్రదేశాలు ప్రాచుర్యంలో ఉన్నవి. ఒకటి గగన్ మహల్ ఇది విజయనగర రాజుల వేసవి విడిది. క్రీ.శ.1575లో గగన్ మహల్ కట్టబడినది. రాజరిక చిహ్నలకు, రాజరికాని నమూన గగన్ మహల్, రెండవది బాబయ్య దర్గా ఆనాటి హిందువుల, ముస్లింల మతసామరస్యానికి మచ్చుతునక పెనుగొండ కోటలో అనేక దేవాలయాల సముదాయాలను చూడవచ్చు. ప్రయాణసౌకర్యాలు : పెనుగొండకోట అనంతపురానికి 50 కి.మీ.దూరంలో బెంగుళూరుకు వెళ్ళే జాతీయరహదారి (హైవే నెం.7) లో ఉన్నది. అనంతపురం నుండి రోడ్డుమార్గంలో బస్పుల ద్వారా వెళ్ళవచ్చు

Penugonda Fort
Penugonda is a small town of Anantapur dist. This famous structure is a tourist place.
It was built by the Vijayanagara kings. And the second capital of Vijayanagar kings and this place is second capital of Vijayanagra Kingdom.
The fort is made of stone, lime and mud. There are two places are famous in this fort. One of the Gagan Mahal is the summer camp of the Vijayanagara kings. The Gagan Mahal was built in 1575 AD. And the second one is Babayya Dargah.
Many temples can be seen in the complexes of in the palace of Penugonda.
Punugonda fort is located at a distance of 50 km from Anantapur. It is beside on the National Highway 7 towards Bangalore. From Ananthapur buses will be available.