ఉదయగిరి కోట నెల్లూరు పట్టణానికి 100 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోట చరిత్ర ప్రసిద్ధి గాంచినది. 3,079 అడుగుల ఎత్తులో సహజమైన ప్రకృతి సౌందర్యంతో, జలపాతాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
వెయ్యేళ్ళనాటి ఈ కోటకు పదకొండవ శతాబ్దంలో ఉదయగిరి పాలకులుగా ఉన్న పల్లవులు పునాదులు వేశారు. పదమూడవ శతాబ్దంలో లంగూళ్ల గజపతి అసంపూర్తిగా ఉన్న కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుర్రపునాడా ఆకారంలో ఉన్న లోయలో ఈ కోటను నిర్మించారు. ఉపరితలం నుంచి పరిశీలిస్తే కోట రూపం నిద్రిస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఎనిమిది ప్రాకారాలు, వందలాది బురుజులు, రాజ ప్రాసాదాలు, రాణివాసాలు, మంత్రుల నివాసాలు ఉన్నాయి.ఈ కట్టడాల్లో ఆనాటి కళావైభవం ద్యోతకమవుతుంది. చుట్టూ జలపాతాలు, ఔషధ మొక్కలతో కూడిన వనాలతో ఉదయగిరి కోట సముదాయం సుందరంగా కనిపిస్తుంది.
గజపతులు మరియు విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందిన కోట ఇది. ఒకప్పుడు 365 ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం ఈ ఆలయాలు శిధిలావస్థలో ఉన్నవి. వీటిలో చక్కటి శిల్ప సంపదను చూడవచ్చు.
చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈ కోటను శ్రీకృష్ణ దేవరాయలు 18 నెలలు ముట్టడి తరువాత ప్రతాపరుద్ర గజపతి నుండి స్వాధీనం చేసుకున్నాడు.
The Udayagiri Fort is about 100 km away from Nellore town. This fort is a historical place. With a natural beauty, waterfall this fort attracts tourists. This for is 3,079 feet above the sea level.
It is a fort is developed by Gajapatis and Vijayanagara kings. There were once 365 temples. These temples are now in ruins but we can be seen with fine sculpture. After a seviour siege by Krishna Deva Raya for 18 months and get this fort from Prataparudra Gajapathi .
There are thirteen buildings, eight of them on the hill and five below. And also consisted of several beautiful temples and gardens.
Udayagiri is a Village in Udayigiri Mandal in the Nellore district. 100 kms away from Nellore