header

Undavalli Caves

Undavalli Caves / ఉండవల్లి గృహలు
ఉండవల్లి గృహలు విజయవాడకు కేవలం 8 కి.మీ దూరంలో ఉండవల్లి గ్రామంలో ఉండవల్లి గృహలు ఉన్నవి. కృష్ణా నదీతీరంలో ఉన్నకొండను తొలచి నిర్మించిన గృహలు ఇవి. ఇవి విష్ణుకుండిన రాజుల కాలానివిగా ప్రసిద్ధిచెందినవి. ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లారు. మధ్యలో ఉన్న స్థంబాలపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇక్కడ రెండవ అంతస్తులో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది.
ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ను గురించి తప్పకుండా కొనియాడాలి. ఈ గృహలు బౌద్ధమత సన్యాసుల విశ్రాంతి మందిరాలుగా భావించబడు చున్నవి.


ఎలా వెళ్ళాలి : విజయవాడ నుండి అమరావతికి వెళ్లే రోడ్డులో ఉండవల్లి గృహలు ఉన్నాయి. బస్సు సౌకర్యం కలదు. గుంటూరు వైపు నుండి వచ్చేవారు మాత్రం మంగళగిరిలో దిగి అక్కడ నుండి ఆటోలలో ఉండవల్లి సెంటర్ కు రావాలి ఉండవల్లి సెంటర్ నుండి ఆటోలలో లేక బస్ లలో గుహలదగ్గరకు వెళ్ళవచ్చు.

Undavalli Caves
This ancient rock cut Undavalli caves are situated on the banks of river Krishna in Guntur dist and very near to Undavalli village
These caves are used by Buddhist monks as rest houses, later these caves are converted into Hindu religion structures. These impressive four storied rock cut caves and temple belongs to 4th and 5th centuries and associated with Vishnukundina kings.
In the second floor, there is a 15 feet statue of God Ananta Padmanabha Swamy is in reclining position. This statue cured out of single granite stone.
The sculptures in these caves, reflects engineering skill of those ancient days. Visiting time: 09-00 am to 06-00 pm on all days
How to go?
These caves are very near to Vijayawada town (approx 6 km) and 25 km from Guntur town. RTC buses will be available from Guntur and Vijayawada will be available frequently.