కడప నగరంలోని శ్రీభగవాన్ మహవీర్ ప్రభుత్వ మ్యూజియం వేల సంవత్సరాల చరిత్రకు నిలువుటద్దం. ఈ మ్యూజియంలో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి గ్యాలరీలో వివిధ దేవతా విగ్రహాలు, రెండవ గ్యాలరీలో జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, మూడవ గ్యాలరీలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లతో సహా ప్రాచీనమైన నాణేలు, ఆయుధాలు భద్రపరచబడ్డాయి. నాలుగో గ్యాలరీలో వీర సైనికులకు చిహ్నాలైన శిలలు ఉన్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మ్యూజియం నడుస్తోంది. జిల్లాలోని మైలవరం వద్ద మరో మ్యూజియం ఉంది.
ఎలా వెళ్ళాలి ? ఈ మ్యూజియం కడప నగరంలోనే ఉంది.