header

Brahmam gari Matam….కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుని మఠం

Brahmam gari Matam….కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుని మఠం
కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక సంపన్నుడు, కాలజ్ఞాన తత్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన ఈ జిల్లాలోని కందిమల్లాయపల్లెలో జీవసమాధి అయ్యారు. ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని భక్తులు నిర్మించారు. ఒక మఠం ఏరాటు చేశారు.
వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో ఉన్న ఆ మఠం కాలక్రమేణా ఆ గ్రామం పేరునే బ్రహ్మంగారిమఠంగా మార్చేసింది. తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అసంఖ్యాకంగా ఈ మఠాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంతో పాటు భజన మందిరం, పోలేరమ్మ గుడి, ఈశ్వరీదేవి మఠం, కక్కయ్యమఠం, సుమారు 15 కి.మీ. దూరంలో సిద్ధయ్య మఠం చూడదగిన ప్రదేశాలు.
ఎలా వెళ్ళాలి?
కడప నుంచి 61 కి.మీ దూరంలో బ్రహ్మంగారి మఠం ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ కడపలో ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వసతి సౌకర్యం: యాత్రికుల సౌకర్యార్ధం టీటీడీ సత్రాలు, మరికొన్ని సత్రాలు ఉన్నాయి.