కడప జిల్లాలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం వైవిధ్యభరితమైన వన్య ప్రాణులకు ఆవాసంగా నిలుస్తోంది. అపారమైన, అపురూపమైన వృక్ష సంపద ఈ ప్రాంతంలో ఉంది. లోతైన లోయలూ, అద్భుతమైన జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. అంతరించిపోయాయని భావిస్తున్న కలివికోడి, హనీబాడ్జర్ లాంటి అరుదైన జీవులు ఈ ప్రాంతంలో కనిపించాయి. ఎలా వెళ్ళాలి?: కడప నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.