header

Pushpagiri Temple…దక్షిణ కాశీ పుష్పగిరి

Pushpagiri Temple…దక్షిణ కాశీ పుష్పగిరి
పినాకినీ, కుముద్వతి, బహుదా, పాపాఘ్ని, మందాకిని నదులు పెన్నా నదిలో కలిసే తీరంలో వైద్యనాథ స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాలతో శివకేశవ క్షేత్రంగా పుష్పగిరి విలసిల్లుతోంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. నదికి ఆనుకుని ఉన్న కొండపై చాణక్య ప్రభువులు ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు వెల్లడిస్తున్నాయి. కొండపై 108 శివాలయాలు ఉండేవని అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది.
ఈ గ్రామంలోని శివాలయంలో శివుడు లింగం రూపంలో కాకుండా మానవ రూపంలో పార్వతీ సమేతంగా ఉండడం విశేషం. శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా స్థాపితమైన పుష్పగిరి పీఠం ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక ప్రాచీన పీఠం ఇదే. శ్రీ విద్యా శంకర భారతి స్వామి ప్రస్తుతం ఈ పీఠానికి అధిపతిగా ఉన్నారు. ఈ పీఠంలో చంద్రమౌళీశ్వరుడు స్ఫటికలింగం రూపంలో పూజలందుకుంటున్నాడు.
ఎలా వెళ్ళాలి ? కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది. అక్కడి నుండి బస్సులు, ఆటోల్లో పుష్పగిరికి చేరుకోవచ్చు.