header

Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట…….

Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట…….
దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది. ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు. 190 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దేవరకోట సంస్థానం.. 1949లో భారతదేశంలో విలీనమైంది.
చల్లపల్లి కోట
చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ.. చల్లపల్లి రాజావారి కోట. బురుజులు, భవంతులతో 20 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. కోట ప్రధాన ద్వారం ఆనాటి అద్భుత నిర్మాణశైలికి ప్రతీకగా నిలుస్తుంది.
కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లివాసులకు గడియారంగా ఉపయోగపడేది. గంట గంటకూ.. ఆ కంచు గంట మోగించే వాళ్లు. దానిని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది.
కోటలోని ప్రధాన భవనంలో ఉన్న శిల్పాలు, పింగాణి సామగ్రి, గృహోపకరణ వస్తువులను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు. ఎలా వెళ్లాలి ?..
విజయవాడ నుంచి చల్లపల్లి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. చల్లపల్లి దగ్గరలో చూడదగ్గ ఇతర ప్రాంతాలు
చల్లపల్లికి సమీపంలో ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.
మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం - 8 కిలోమీటర్లు
శాస్త్రీయ నృత్య కేంద్రమైన కూచిపూడి - 16 కిలోమీటర్లు
పెదకళ్లేపల్లి శ్రీదుర్గానాగేశ్వరస్వామి ఆలయం - 10 కిలోమీటర్లు
శ్రీకాకుళేంద్ర మహావిష్ణు ఆలయం – శ్రీకాకుళం
కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి - 35 కిలోమీటర్లు
బౌద్ధ క్షేత్రం ఘంటసాల మరియు పార్వతీ జలధీశ్వరస్వామి దేవాలయం - 8 కిలోమీటర్లు