header

Ghantasala Boudha Stupam / ఘంటసాల బౌద్ధస్థూపం

ఘంటశాల
ఘంటశాల కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఈ గ్రామములో అరుదైన బౌద్ధ స్తూపాలు 1919-20 సంవత్సరాల మధ్య త్రవ్వకాలలో దొరికాయి. ఘంటసాల గ్రామంలోని బౌద్ధమహా స్థూపం వద్ద, 2014,ఏప్రిల్ 15వ తేదీ, మంగళవారం నాడు, మహాచైత్రపౌర్ణమి సందర్భంగా, బౌద్ధభిక్షువు దమ్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమబుద్ధుని చిత్రపటానికి ధూప, దీప, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘంటశాలలో మ్యూజియం కూడా ఉన్నది. ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన వాటిని మరియు శాతవాహనుల, రోమన్లకు చెందిన బంగారు నాణాలను కూడా చూడవచ్చు.
ఘంటశాల గ్రామంలో ప్రసిద్ధి చెందిన పార్వతీ జలధీశ్వరాలయం (శివాలయం) కూడా ఉన్నది. ఘంటశాల విజయవాడ నుండి 60 కిమీ దూరంలో ఉంది. బస్ ల ద్యారా వెళ్లవచ్చు. సొంత వాహనాల వారు పామర్రు నుండి కుడిప్రక్కకు తిరగవలసి ఉంటుంది.

Ghantasala
A rare Buddhist stupa found in Ghantasala Village. This stupa has unique design and cubic bricks are set in the center. This stupa displays the 12 signs of the zodiac. Ghantasala is a renowned Buddhist center in the ancient time.
The dome of the stupa was adorned by 47 slabs depicting the Buddha. This stupa had a 112 feet circumference and 23 feet height.
Alexander Rea, a Britisher excavated this stupa. And it was called as Katakasila in those days.
How to go ?
60 km from Vijayawada. Well connected by road.