header

Kolleru Lake / కొల్లేరు సరస్సు

Kolleru Lake

Kolleru Lake / కొల్లేరు సరస్సు
కొల్లేరు సరస్సు (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సహజమైన మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో 77,138 ఎకరాలో ఈ సరస్సు విస్తరించి ఉన్నది. కృష్ణా జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాలో 12 వేల ఎకరాలో విస్తరించి ఉన్నది. తమ్మిలేరు, బుడమేరు, ఎర్రవాగు వంటి చిన్న చిన్న నదు ఇందులో కుస్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమైన తరువాత ఆస్ట్రేలియా, నైజీరియా, ఫిజి దేశా నుండి పక్షులు వచ్చి సంతోనోత్పత్తి తరువాత పిల్లలతో సహా తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోతాయి.
వలస పక్షులో ఎక్కువగా వచ్చేవి పెలికాన్‌ (గూడబాతు) పక్షులు. కొల్లేరు అక్రమ ఆక్రమణకు గురికావటంతో 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమ చెరువును ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో ధ్వంసంచేసి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవారు ప్రకటించారు. కొల్లేటి అందాలను మరియు పక్షులను తికించేందుకు దేశవిదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. సరస్సుపై కర్రల వంతెన ప్రత్యేక ఆకర్షణ. కొల్లేరులో వెలసిన పెద్దింట్లమ్మను పడవలలో వెళ్ళి దర్శించుకొనవచ్చును. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో (మార్చి) పెద్దింటమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయి.
ఎలా వెళ్ళాలి
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణం నుండి 15 కి.మీ. దూరంలో కొల్లేరు సరస్సు ఉన్నది. బస్‌లో వెళ్ళవచ్చు.బయటి ప్రాంతాల నుండి వచ్చేవారు విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే రైళ్ళు ఎక్కి ఏూరులో దిగవచ్చు. బయటి ప్రాంతాల వారు ఏలూరులో బసచేయవచ్చు. నవంబర్‌ నుండి మార్చి వరకు పర్వటనకు అనుకూలం.

Kolleru Lake / కొల్లేరు సరస్సు
Kolleru lake is know as world famous fresh water lake and is extended in two districts Krishna and West Godavari. It is a best place for natural lovers and bird watchers. This lake was declared as wildlife sanctuary in 1999.
from Australia, Siberia, Egypt and Philippines migratory birds like Bill Storks, painted Storks, Glossary Ibises, White Ibises, Teals, Pintails, Shovellers, Red-Crested Pochards, black-winged Stilts, Avocets, Common Redshanks, Winged Stilts, Avocets, Common Redshanks, Pigeons, Gadwalls and Cormorants and many other birds will come here. Best time to visit this place is between November February.
Famous Peddintlamma Temple is seen here.
How to go ?
Kolleru Lake Bird Sanctuary is 60 km distance from Vijayawada (Krishna dist, Andhra Pradesh), 15-km from Eluru and 1.5 km from Kaikaluru town (West Godavari district in Andhra Pradesh). Nearest Railway stations are Eluru and Kaikaluru.
Accommodation
Best accommodation will be available at Vijayawada and Eluru towns.