Krishnam Beach….కృష్ణపట్నం బీచ్
కృష్ణపట్నం ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి పొందుతోంది. డీప్‌వాటర్ పోర్టుగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టుతో పాటు కృష్ణపట్నం గ్రామంలో శతాబ్దాల కాలం నాటి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని క్రీ.శ.1270 వ సంవత్సరంలోనే మనుమసిద్ధి మహారాజు పునర్నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ మండపంలోని స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. నెల్లూరు పట్టణానికి 25 కి.మీ.దూరంలో ఉన్న ఈ పురాతనమైన రేవుపట్నం సహజమైనది మరియు పరిశుభ్రమైన వాతావరణంతో వుంటుంది. విశాలమైన ఇసుకతిన్నెలతో, పచ్చటి కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
రణగొణ ధ్వనులతో కూడిన పట్టణ జీవితంనుండి ప్రశాంతంగా గడపటానికి అనుకూలమైన ప్రదేశం.
బీచ్‌కి వెళ్లే దారిలో వున్న కృష్ణపట్నం లైట్‌హౌస్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ లైట్‌హౌస్ పైనుంచి కృష్ణపట్నం పోర్టు, పరిసర ప్రాంతాలను తిలకించవచ్చు. కృష్ణపట్నం పోర్టులో పర్యటించేందుకు, లైట్‌హౌస్ ఎక్కేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి ?... నెల్లూరు నగరానికు 25 కి.మీ. దూరంలో వున్న కృష్ణపట్నం పోర్టు, కృష్ణపట్నం గ్రామానికి నెల్లూరు నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు వున్నాయి. బీచ్‌ను చేరుకోవాలంటే కృష్ణపట్నం నుంచి ఆటోల్లో లేదా సొంత వాహనాలపై రెండు కి.మీ. ప్రయాణించాలి.
Krishnapatnam is more famous for its port than its beach. Krishnapatnam
beach is a pristine and clean beach offers a memorable escape from the rigours of daily
life. The long stretch of golden sand shifting silently under the feet and the palm trees
dotting the beach can be captivating and inviting.The beach is about 24 kilometres from the
city of Nellore and is easily accessible to people looking to spend some wonderful moments
enjoying the solitude and watching fishermen hard at work. The warm waters kissed by rays of
the sun are inviting and can wash away the fatigue and aches and pains of travel. This beach
is perfect for families and those looking to get away from the noise of city life.
Mypadu Beach... మైపాడు బీచ్ :
నెల్లూరు జిల్లాలోని మైపాడు సాగరతీరం రమణీయ ప్రకృతి దృశ్యాలకు నెలవు. నెల్లూరు కోనసీమగా పేరు గాంచిన ఇందుకూరుపేట మండలంలోని మైపాడుకు జిల్లా కేంద్రం నుండి ప్రయాణం గొప్ప అనుభూతి. పచ్చదనంతో కళకళలాడే వరిపొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలకరిస్తాయి. మైపాడు పర్యాటక కేంద్రంలో విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోడానికి సౌకర్యాలు ఉన్నాయి. తీరం పక్కనే శివాలయం ఉంది. ఆదివారాలు, సెలవులు పండగ రోజుల్లో బోటు షికారు, సముద్ర ఇసుక తిన్నెల మీద హార్స్ రైడింగ్ చేసేందుకు సౌకర్యం ఉంది.
ఎలా వెళ్లాలి ?..
నెల్లూరు పట్టణానికి 25 కి.మీ. దూరంలో మైపాడు బీచ్ ఉంది. ఆర్టీసీ బస్సులు నేరుగా బీచ్ వరకూ వస్తాయి.
వసతి: ఏపీ టూరిజం శాఖ వారి హరిత రిసార్ట్స్‌లో బస చేయవచ్చు. రెస్టారెంట్ కూడా ఉంది. గదులను జిల్లా కేంద్రంలో లేదా టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
Mypadu beach
This beach is at a distance of 25 km from Nellore city. There are plenty of buses from Nellore
city to Mypadu beach. The beach offers cruise and fishing opportunities for tourists. This is
a good sandy beach with eyeful greenery. This is a peaceful and beautiful beach. There is an
Andhra Pradesh Tourism hotel for accommodation.
కోడూరు బీచ్ :
కోడూరు బీచ్ నెల్లూరుకు 18 కి.మీ. దూరంలో కలదు. ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. వారాంతపు సెలవులు గడపటానికి అనుకూలమైనది.
ఇక్కడ నుండి కోడూరు బీచ్ కు సముద్రంలో బోట్ షికారు ఒక మధురమైన అనుభూతి. ఇక్కడున్న చిన్న చిన్న పలహారశాలలో చేపలతో చేసిన రుచికరమై వంటకాలు రుచిచూడవచ్చు.
సముద్రతీరంలోనే ప్రసిద్ధి చెందిన వేళంగిని మాత చర్చ్ కలదు.
Kodur Beach
is 18KM away from city. We can get buses/autos from Atmakur Bus Stand. Here boating
is also allowed on weekends. Everyone can enjoy this trip to Kodur beach with tasteful
fish items in the small stalls located there. This is a really beautiful beach. Besides
the shore, there is a famous Velangani maata church which is so beautiful.
తుపిలిపాలెం బీచ్ :
తుపులిపాలెం బీచ్ బంగారు వర్ణపు ఇసుక తిన్నెలతో, పచ్చటి చెట్లతో అద్భుతంగా ఉ:టుంది. సముద్రపు ఒడ్డున ఇసుకలో కొద్దిగా ఇసుకను త్రవ్వితే స్వచ్ఛమైన మంచినీటిని త్రాగవచ్చు. ఈ బీచ్ లో
సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం ఒక మధురమైన అనుభూతి కలిగిస్తుంది. బోటింగ్ సౌకర్యం మరియు వసతి సౌకర్యం కలదు.
తూపిలిపాళెం సముద్రతీరం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీని సరిహద్దుల్లో40 లైట్లతో బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన ఆర్ముగం లైట్‌హౌస్, సుప్రసిద్ధమైన పంట్రంగం ఆలయం ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి ? గూడూరు నుంచి 4 కి.మీ., నాయుడుపేట నుంచి39 కి.మీ. దూరంలో తూపిలిపాళెం వుంది. నాయుడుపేట, గూడూరు నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.వాకాడ టౌన్ నుండి 12 కి.మీటర్ల దూరంలో కలదు.
కోట టౌన్ నుండి బస్సులలో తుపిలిపాలెం బీచ్ కు బస్ లలో వెళ్ళవచ్చు.
Thupilipalem beach
is a really fantastic beach. It has a world-class
look and diversity. It has golden sands, Beautiful green trees. One can dig the sand for
some feet and drink the tasteful water here. One can see extraordinary sun rising and sun
setting here. And also we can see so many flying beautiful birds on the boats and the sea.
It will be a memorable trip for every visitor. Guest house and boating facilities are available here
. This beach is located at a distance of 12 kms from Vakadu town. There are regular buses from Kota
town to Tupilipalem.
Thummalapenta Beach తుమ్మలపెంట బీచ్
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట తీరంలో సముద్రపు ఒడ్డున ఏపి టూరిజం శాఖ నిర్మించిన హరిత బీచ్ రిసార్ట్స్ సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. తీరప్రాంతంలో ప్రక్కనే సముద్రం ఉండటంతో ఆ పర్యాటక కేంద్రానికి వారాంతాలలో మరియు, సెలవుదినాలలో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. పన్నెండు ఏసీ గదులు, ఒక రెస్టారెంట్ పర్యాటకుల కోసం ఉన్నాయి. పర్యాటక కేంద్రంలో పిల్లల కోసం
ఊయల. జారుడుబల్ల, ఆటవస్తువులు ఏర్పాటుచేశారు. త్వరలో బోటు షికారు ఏర్పాటు చేయబడుతుంది.
ఎలా వెళ్ళాలి…?
కావలిపట్టణానికి 10 కి.మీ, నెల్లూరుకు 70 కి.మీ. దూరంలో తుమ్మలపెంట ఉంది. కావలి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.