శాలి హుండం ప్రసిద్ధ బౌద్ద క్షేత్రం శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో ఉన్నది. వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నగ్రామము శాలి హుండం. వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు మరియు శిథిలమైన దేవాలయాలతో, సహజమైన ప్రకృతి అందాలతో కనువిందు చేసే అందమైన క్షేత్రం. పూర్వము శాలిహుండానికి శాలివాటిక - బియ్యపు ధాన్యాగారము అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక -ఎముకల పెట్టె అని కూడా పిలిచేవారు.
శాలిహుండం, పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగపట్నానికి పడమర వైపున 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు బౌద్ధకాలానికి చివరిదశలోనివి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు. శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు.
ఆ తరువాత ఈ ప్రదేశములో ఎ.హెచ్.లాంగ్‌హర్స్ట్, టి.ఎన్.రామచంద్రన్ మరియు ఆర్.సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు చేపట్టారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు బయటపడ్డాయి.
క్రీ.పూ.2వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధమత శాఖలను ప్రతిబింబిస్తున్నాయి
శాలిహుండం శ్రీకాకుళం పట్టణానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో మరియు కళింగపట్నంనకు 5 కి.మీ దూరంలో ఉన్నది.
Shalihundam is a famous Buddhist site located in Salihundam village, Srikakulam district, Andhra Pradesh. Salihundam is a small village on the south bank of Vamsadhara river.
The scenic beauty of the lush green landscapes are very attractive here.
The ruins seen here in Shalihundam are belongs last stage of Buddhism. Some brick structures seem to be older. The Shalihundam field was first discovered in 1919 by the Pandit Gidugu Ramamurthy
Later, AH Langhurst, TN Ramachandran and R.Subrabharman were also excavated in this area. Four stupas, a chaitya home and many sculptures were found in the excavitions.
These sculptures reflects the three Buddhist branches Theravada, Mahayana and Hinayana extending which are from the 2nd century to the 12th century AD,.
Shalihundam is located at a distance of approximately 18 km from Srikakulam town and 5 kms from Kalingapatnam, an ancient harbor town.