ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నిర్వహించ బడుచున్న పక్షుల కేంద్రం. తెలినీలాపురం పక్షుల కేంద్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండంలో (తెలినీలాపురం గ్రామం) శ్రీకాకుళానికి 65 కి.మీ దూరంలో ఉన్నది.
తేలుకుంచి శ్రీకాకుళానికి 115 కి.మీ. దూరంలో ఇచ్ఛాపురం మండంలో ఉన్నది. ప్రతి సంవత్సరం సైబీరియా నుండి షుమారు 3,000 పెలికాన్స్ మరియు పెయింటెడ్ స్టార్క్స్ (ఒక రకమైన కొంగలు) ఇక్కడకు వస్తాయి. సెప్టెంబర్ నెలలో ఇక్కడకు వచ్చి మార్చి నెలలో తిరిగి వెళతాయి.
ఆంధ్రా యూనివర్శిటీ వారు జరిపిన పరిశోధల మేరకు 15 సంవత్సరాల క్రితం ఇక్కడకు 10,000కు పైగా పక్షులు వలస వచ్చేవని తెలుస్తుంది. ప్రస్తుతం 3,000 పక్షులు మాత్రమే వస్తున్నవి.
శ్రీకాకుళం నౌపాడా రైల్వేస్టేషన్ నుండి షుమారు 3 కి.మీ. దూరంలో తెలినీలాపురం ఉంది. నౌపాడా నుండి ఆటోలో వెళ్ళవచ్చు. బస్సు మార్గంలో విశాఖపట్నం నుండి టెక్కలికి వెళ్ళి అక్కడనుండి ఆటోలో వెళ్ళవచ్చు.
Telineelapuram and Telukunchi Bird Sanctuaries both are located in Srikakulam district of Andhra Pradesh. Both sanctuaries are undertaken by Government of Andhra Pradesh.
Telineelapuram is a small village located 65 kilometers from Srikakulam in Tekkali mandal, and Telukunchi is at a distance of 115 kilometers from Srikakulam situated in Ichchapuram mandal.
3,000 pelicans and painted storks are come to these villages from Siberia during the September month and returns in the month of March.
In Andhra University scholars observations, 15 years ago 10 thousand birds are migrated from Siberia, But at present, the birds has been reduced to 3,000 only.
Nearest railway station is Naupada. Telineelapuram is 3 km from Naupada railway station. Road connectivity from Visakhapatnam to Telineelapuram via Tekkali.