header

Araku Valley tourism/ అరకులోయ పర్యాటకం

Araku Valley tourism/ అరకులోయ పర్యాటకం

అరకులోయ విశాఖపట్నం డుంబ్రీగూడ మండలానికి చెందిన గ్రామము. సముద్రమట్టానికి 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్లదూరంలో ఉన్న అరకులోయ ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలు, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అరకు లోయ ప్రయాణం ఒక గొప్ప అనుభూతి. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే దారిలో పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, మల్బరీ తోటలు, సిల్క్¬ ఫారం మరియు అనంతగిరి కాఫీ తోటలను చూడవచ్చు.
అరకు వెళ్లేటపుడు రైలు ప్రయాణం, తిరుగు ప్రయాణంలో బస్ ప్రయాణం చేస్తే అన్ని ప్రకృతి దృశ్యాలను చూడటానికి వీలవుతుంది.ఈ ప్రయాణం సుమారు 5 గంటలసేపు సాగుతుంది. 58 సొరంగమార్గాలు,64 వంతెనల మీద నుండి సాగే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు వెళ్లేదారిలోనే బొర్రాగుహలు ఉన్నాయి.
అరకులోయలో కాఫీతోటలు పేరుపొందినవి. గిరిజనులు రసాయనిక ఎరువులు వాడకుండా పండిస్తారు. ఈ కాఫీ పౌడర్ ‘ఎమరాల్డ్’ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతుంది. ఆకర్షణలు
గిరిజనులు తయారు చేసే వస్తువులు, గిరిజనాభివృద్ధి సంస్థ అమ్మే స్వచ్ఛమైన తేనె కొనవచ్చు. ఇక్కడికి 15 కి.మీ. దూరంలో ఉన్న తాటిదూడ, కటికి, చప్పరాజ్ అనే ప్రదేశాలు మంచి పిక్ నిక్ ప్రదేశాలు. గిరిజనుల సంస్కృతిని తెలిపే ట్రైబల్ మ్యూజియంను చూడవచ్చు.
అరకులోయలో 19 గిరిజన తెగలవారు తమ పురాతన సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. ఇటికాల పొంగల్ అనే పండుగరోజున చేసే సాంప్రదాయక నృత్యం చాలా పేరుపొందినది. ఇప్పుడూ రోజూ పర్యాటకులకోసం నృత్యం ప్రదర్శిస్తున్నారు. సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తు ఉన్న గాలి కొండలు అనే ప్రదేశాన్నుండి అరకులోయ మొత్తాన్ని చూడవచ్చు.
విస్టాడోమ్ బోగీ ప్రత్యేకం.....
విశాఖ నుంచి అరకు దూరం 130 కిలో మీటర్లు. విశాఖ నుండి రైలు ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు పదిన్నరకు బొర్రాగుహలు 11 గంటలకు అరకు చేరుకుంటుంది.
ఈ రైలుకు ప్రత్యేకంగా ఒక విస్టాడోమ్ అనే భోగి అమర్చారు. ఈ భోగి మొత్తం అద్దాలతో నిర్మించబడింది. 40 సీట్లున్న ఈ బోగీలో అనంతగిరి అడవుల సౌందర్యం, ఎత్తయిన కొండలు, సొరంగమార్గాలు, జలపాతాల అందాలను మిస్సవకుండా చూడవచ్చు. రైలు వేగం గంటకు 30 కి.మీ. మాత్రమే. ఈ బోగీ రైలుకు చివరిలో అమర్చుతారు. బోగి చివరిలో లాంజ్ కూడా ఉంది. కానీ పదిమంది మాత్రమే నిల్చుని చూసే వీలుంది.
ఎప్పుడు వెళ్లవచ్చు ?
సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా అరకులోయకు వెళ్లవచ్చు. కానీ శీతాకాలంలో వాతావరణం మైనస్ నాలుగు డిగ్రీలకు పడిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లటం మంచిది. వర్షాకాలంలో వెళ్లేవారు గొడుగులు, రెయిన్ కోట్స్ తీసుకు వెళ్లటం మంచిది. వర్షాకాలంలో వాతావరణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో పలిస పూలతో కొండలన్నీ కప్పబడి పసుపు వర్ణంతో ఎంతో అందంగా ఉంటాయి. ఆగష్ట్ నుండి యాత్రికుల సందడి ఎక్కువగా ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?
విశాఖపట్నం నుండి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా అరకులోయకు వెళ్లవచ్చు. విశాఖ ఈశాన్య రైల్వే లైన్ లో కొత్తవలస – కిరండల్ రైలు మార్గంలో అరకు మరియు అరకులోయ అనే రెండు స్టేషన్లు వస్తాయి. విశాఖపట్నానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో అరకులోయ ఉన్నది.
వసతి సౌకర్యం
అరకు లోయలో అన్నితరగతుల వారికి అందుబాటులో కాటేజెస్, లాడ్జీలు, గెస్ట్ హౌసెస్ కలవు. కాని ముందుగా వసతి రిజర్వేషన్ చేసుకుంటే తరువాత వెతుకులాట తప్పుతుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని హోటల్స్ / గెస్ట్ హౌస్ ల చిరునామాలు
తరువాత పేజీలో... ఇవ్వబడినవి.

Araku Valley tourism
Araku valley tour is a memorable and pleasant tour. Picturesque, natural beautiful landscapes, valleys, waterfalls are very attractive in this area.
Visakhapatanm to Arakuvalley train journey is a wonderful and unforgettable journey. Train passes through 58 tunnels and passing over 84 bridges. Visitors will enjoy sheer of joy with this journey. August to February is the best time to visit Araku Valley. Tourist can remember, atmosphere in December and January will goes down to 4 degrees Celsius. It is better to go upward journey by train and return journey by bus. In the return journey you can visit borra caves which are famous caves in Andhra Pradesh.
Chaparai water falls
It is also called as Dumbriguda Waterfalls, it is a scenic place surrounded by forests. Chaaparai is a beautiful water cascade is 13 km far way from Araku and situated on Paderu - Araku Road in Vishakhapatnam district. His waterfalls are most attractive tourist and picnic place.
Tribal Museum
This tribal museum is one of the interest place to know the trible culture in western ghats, it is very near to Araku. 19 different tribal people are living this valley protecting their traditional culture.
Katiki Waterfalls
This wonderful waterfall is located near 39 km from Araku and ner Borra caves. This waterfall drops from a height of 100 feet. A small pond was formed with this water and tourists used to take a bath in this pond to relax. Tourist can cook and camp here.
Padmapuram Gardens
Padmapuram botanical gardens are famour botanical gardens in in Araku valley. Theses gardens are very near to araku bus station (about 2.5 kilometers )
In this garden 3 tree top huts are available for visitors. These hanging cottages are built 10 feet height from the ground . Exotic varieties of plants and a beautiful roses garden is seen here. Actually this garden for arranged in the year 1942 to supply vegetables to soldiers, later it is converted to Horticultural Nursery cum training center.
At a distance of 2.5 km from Araku Bus Station, Padmapuram Gardens is a popular botanical garden situated in Araku. It is one of the well-known places of sightseeing in Araku Valley.
Accommodation
APTDC has two resorts in Araku valley. Haritha Valley Resort, Tribal Cottage, Ushodaya Resorts, Dhimsa Resorts and SRK Resort are other cottages available here. Plenty of small inns and budget hotels are availbe with basic facilities. It is better to make accommodation arrangements in advance. Araku coffee and bamboo chicken is famous here. Few multi cuisine restaurants are served South Indian, Chinese and Odiya dishes to the tourists. And other food outlets include Vasundhara Restaurant, Chandrammas Spicy Restaurant, Hills View and Sri Annapurna Tiffin Center.
How to reach Araku Valley
Arku valley is connected by Rail and Road from Visakhapatnam. AP tourism departmet offers best tour package to Araku.
Arakuloya Hotels/accommodation... next page