Bojjannakonda Biddhist place / బొజ్జన్న కొండ
విశాఖపట్నం జిల్లా శంకరం గ్రామానికి దగ్గరలో గల బొజ్జన్న మరియు లింగాల కొండలపై బౌద్ధమతానికి సంబంధించిన సంఘారామాలు కలవు. ఇవి క్రీ.శ. 4 నుండి 9వ శతాబ్దాల కాలం నాటివిగా భావించబడుచున్నది.
ఒకేశిలలో చెక్కిన స్థూపాలు, కొండలో మలచబడ్డ గుహలు ఇక్కడి ప్రత్యేకతలు. మొత్తం 4 గుహలలో మూడింటిలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధ విగ్రహలున్నాయి. ప్రతి గుహకు ఇరుప్రక్కలా పెద్ద పెద్ద ద్యారపాలకుల విగ్రహాలున్నవి. గుహ లోపలిభాగం చతుర్భుజాకారంలో ఉండి పదహారు స్థంబాలతో ఇరువది గదులతో తొలచబడింది. గుహ మధ్యలో చతురస్రాకారపు గద్దెపై స్థూపం నిర్మించబడినది.
ఇక్కడ ఉన్న ప్రధాన స్థూపం రాతిలో మలచబడి, చుట్టూ ఇటుకల కట్టడం ఉంటుంది. బొజ్జన్నకొండపై బౌద్ధ బిక్షువులకొరకు నిర్మించబడిన విహారాలు, చైత్యాలు, బిక్షువుల గదులు ఉన్నాయి. 1907 ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో 4వ శతాబ్దనికి చెందిన సముద్రగుప్తుని నాణేలు, చాళుక్యరాజు కుబ్జ విష్ణువర్థనుని మరియు ఆంధ్రశాతవాహనుని కాలం నాటి నాణేలు దొరకినవి. లింగాలకొండ అంచున రాతిలో తొలచబడిన అనేక స్థూపాలు కలవు.
Bojjannakonda Biddhist place / బొజ్జన్న కొండ
Bojjanakonda and Lingalakonda both adjacent hills are situated in Sankaram village of Visakhapatnam dist. Both hills are surrounded by agricultural fields.
Both hills are Buddhist estblishments, comprising rock cut caves, stupas, 3 chaitya halls, vazrayana sculptures.
A Britisher Alexander Rea unearthed Sankaram, a 2000-year-old Buddhist Heritage site in 1907.
A gold coin found here is belongs to King Samudra Gupta dating back to 4th century. This place reflects Theravada, Mahayana and Vazrayana phases of Buddhisim.
How to go This popular Buddhist place is located 40 km from South of Vizag near to Anakapalli town.
|