header

Bobbili Fort

Bobbili Fort / బొబ్బలి కోట

బొబ్బలి కోట మట్టితో కట్టబడినది. బొబ్బిలి సంస్థానం 17వ శతాబ్దంలో పెద్దరాయుడుచే ఏర్పాటుచేయబడినది. బొబ్బిలి యొక్క పూర్వనామం పెద్దపులి. శ్రీకాకుళం నవాబు షేర్ మహ్మద్ ఖాన్ కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు. పెబ్బలి, బెబ్బలిగా పిలవబడిన బొబ్బిలి తరువాత బొబ్బిలిగా స్థిరపడింది.
1750లో విజయనగరం ప్రభువు విజయరామరాజు ఫ్రెంచ్ సైన్యం సహాయంతో బొబ్బిలి రాజు రామారావు మీదకు యుద్ధానికి వస్తాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రసిద్ధి పొందినది.ఈ యుద్ధంలో ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను బద్దలు కొట్టాయి. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు.ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంత్రానికి ముగిసిపోయింది.
ఫ్రెంచి వారు ఉదయం 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది. యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది.
లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. యుద్ధం ముగిసిన మూడు రోజుల తరువాత విజయరామరాజు శిబిరం పైకి ముగ్గరు బొబ్బిలి వీరు దాడి చేస్తారు. వారిలో ఒకరు బొబ్బలిపులిగా పేరుపొందిన తాండ్రపాపారాయుడు. ఇతను విజయరామరాజును చంపివేస్తాడు. తరువాత ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు. బొబ్బిలి కోటలో జరిగిన ఈ ప్రాణాహుతి తెలుగుదేశం యవత్తూ అనేక బుర్రకథలకు స్ఫూర్తినిచ్చింది

Bobbili fort
The Bobbili fort was built with mud. The Bobbili samstanam was established by Pedarayudu in 17th century. In 1750, Vijayanagaram king Vijayarama Raju came to war with Bobbili king Ramarao with the help of the French army. The war between them was known as the famous Battle of Bobbili in the history of Andhra Pradesh.
In this battle, the French artillery broke the Bobbili mud fort. However, because of the Bobbili heroic resistance, the French army could not enter the castle. The war began in the morning and ended in the evening.
The French army take a break two hours in the morning at 9 o'clock and continued the artillery and proceeded again. The French army did not enter the fort until all legend of Bobbili soldiers fell down in the battle. Those who entered in the fort, were shocked at the sight, dead women and children in the fire. This predictor in the Bobbili fortress has inspired many burra kathalu
Bobbili is 55 kilometres away from Vizianagaram Bobbili is well-connected by rail, road. Nearest railway station is Vizianagaram, a key railway junction on the Raipur-Vizianagaram railway line.