అనంతపురం జిల్లాలో ఉన్న ఆలూరుకోన జలపాతం ప్రాంతం కొండలు, కోనలతో ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. రెండు కొండల మద్య వచ్చే జలధారలతో కనువిందు చేసే ఈ జలపాతం సంవత్సరం అంతా కళకళలాడుతూ ఉంటుంది.
శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తాడిపత్రి కైఫియత్ ప్రకారం ఈ దేవాలయం 14వ శతాబ్దంలో ఎర్రతిమ్మరాజుచే నిర్మించబడింది. షుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హజీవలి దర్గా కొండసైభాగంలో కలదు
ఎలావెళ్ళాలి...?
ఆలూరుకోన జలపాతం అనంతపురంలోని తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో కలదు.