అనంతపురం జిల్లాలోని కదిరి రేంజ్ అటవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. 80 అడుగుల ఎత్తునుండి ఉరకలేసే ఈ జలపాత సౌందర్యాన్ని చూడవలసిందే.
వర్షాకాలంలో నీటి ఉదృతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న కొండలపై నీటి గుండాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ గుండాలు నీటితో నిండి వాటిని జలపాతంలా కిందికి దూకుతుంది. వర్షాకాలం తరువాత కూడా సుమారు 20 రోజుల పాటు జలపాతం ఉంటుంది.
ఎలా వెళ్లాలి? అనంతపురానికి 105 కిలోమీటర్ల దూరంలోనే కదిరికి 15 కి.మీ దూరంలో ఉంది. స్థానికంగా వసతి సదుపాయాలు లేవు పర్యాటకులు కదిరిలో గానీ, అనంతపురంలో గానీ బస చేయవచ్చు.