header

Duduma Water Falls…అందాల డుడుమ

Duduma Water Falls… డుడుమ
ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల నడుమ డుడుమ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.. ఏడాది పొడవునా నీటిప్రవాహం ఉండటం డుడుమ జలపాతం ప్రత్యేకత. 550 అడుగుల ఎత్తు నుంచి పడుతూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సమీపంలోనే మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రం ఉంది. డుడుమ వద్ద నుంచి చూస్తే ఒక జలపాతం కనబడుతుంది. టిపి డ్యాం వద్ద నుంచి చూస్తే టిపి డ్యాం డిశ్చార్జ్‌ నీటితో కలిపి మొత్తం 3 జలపాతాలు కనిపిస్తాయి
ఎలా వెళ్లాలి?...డుడుమ జలపాతానికి విశాఖ నుంచి కిరాండోల్‌ ప్యాసింజరు రైలు ఉదయం 6.50కి బయలుదేరుతుంది. దాంట్లో బెజ్జా జంక్షన్‌ వద్ద దిగి అక్కడ నుంచి షేరింగ్‌జీపుల ద్వార డుడుమ చేరుకోవచ్చు.
విశాఖ నుంచి ఒనకడిల్లీకి ఎపీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఉంది. ఉదయం 5 గంటలకు విశాఖలో బయలుదేరి మధాహ్నం 12 గంటలకు చేరుకోవచ్చు. విజయనగరం నుంచి ఒనకడిల్లీకి ఒకప్రయివేటు బస్సు ఉంది. తెల్లావారు జామున 4గంటలకు బయలుదేరి మద్యాహ్నం 4కు చేరుతుంది.