

 
సుందరమైన దృశ్యాలతో, చుట్టూ పచ్చని చెట్లతో అందమైన కొత్తపల్లి జలపాతం విశాఖపట్నం మన్యలో కొత్తగా వెలుగుచూసిన జలపాతం. 2012 సంవత్సరంలో  స్థానిక గ్రామీణుల ద్వారా ఈ జలపాతం ఉనికి బయట ప్రపంచానికి తెలిసింది. 
 దట్టమైన అటవీప్రాంతంలో షుమారు 500 అడుగుల లోతును కొండ దిగువున ఉన్న ఈ జలపాతాన్ని స్థానిక గిరిజన యువకులు గుర్తించారు. సాహసంతో అక్కడకు చేరుకుని వెయ్యి అడుగుల పైనుండి పడుతున్న ఈ జలపాతం పరవళ్లను కెమేరాలలో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయటప్రపంచానికి తెలియటం కోసం జలపాతం చిత్రాలతో ఉన్న బేనర్లను రహదారి ప్రక్కనే అమర్చారు. గ్రామస్ధులు శ్రమదానంతో కొండలమీదుగా ఓ కాలిబాట మార్గాన్ని కూడా ఏర్పాటుచేశారు.
కొత్తపల్లి విశాఖపట్నానికి పశ్ఛిమంగా షుమారు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విశాఖపట్నం నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు
 
This unexplored waterfalls were discovered ¬ in the 2012  by local  villagers. The Kothapally waterfalls is in Gangaraju Madugula Mandal, near Paderu in  Visakhapatnam district of Andhra Pradesh.
Hear water drops from 1000 feet height. A small way built by villagers to reach this waterfalls. 
 It is located 96 KM towards west from Vishakhapatnam town.  Only road connectivity to this village from Visakhapatnam.