తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు సమీపంలో పొల్లూరు దిగువ, ఎగువ జలపాతాలున్నాయి. లక్కవరం రేంజిలోని దట్టమైన ఆరణ్యాల మధ్య ఎత్తైన కొండల నడుమ నుంచి లోయలోకి జాలువారే ఈ జలపాతం ప్రకృతి సౌందర్యాన్ని చూడవలసిందే.
సీలేరు నదికి ఉపనదైన ఆలిమేరు వాగు(పొల్లూరు జలపాతాలు) దట్టమైన ఆరణ్యాలు, ఎత్తైన కొండల నడుమ నుంచి ప్రవహిస్తూ నీరు కిందికి దూకే దృశ్యం పర్యాటకులకు కనువిందే. ఈ కొండల మీద నుంచి జాలువారే జలపాతాన్ని శివుని శిరస్సు నుంచి జారే గంగాదేవితో పోలుస్తారు. ఈ జలపాతంలో స్నానం చేస్తే స్వయంగా గంగాదేవి శరీరాలను తాకి పాప విముక్తుల్ని చేస్తుందని నమ్ముతారు.
ఒడిశా రాష్ట్రం ప్రతి రెండేళ్లకోకసారి నిర్వహించే మణిమకొండ నెల రోజుల జాతరలో మొదటి రోజు ఉత్సవాన్ని(వన దేవతలకు మంగళ స్నానం)ఈ జలపాతం వద్ద నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు