

 
ఉబ్బల మడుగు జలపాతం దీనినే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. ఇది వర్షాకాల సమయంలో అనగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతంలో నీరు పడుతుంటుంది. ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. పర్వతారోహణకు, మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు.
ఇది శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం గ్రామం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహా శివరాత్రి సమయంలో ఆర్.టి.సి. వారు రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు.  
Also known as Tada  falls are located in a dense forest called Siddulaiah Kona,  in Chittoor district .  It comes under Buchinaidu kandriga,  Varadaiahpalem .  
 Lord Shiva temple is here. At the time  of Maha Shivaratri festival  thousands of devotees will visit  this place.  Lush forest and rocky formation of the this area  attracts tourists.
 
It is an ideal famous place  for treckking . Local and Chennai people will come to trekking. Trekking guide will  available. Trekking distance appro. 10 kms both way. 
 
To go to  the falls visitors have go through the Varadaiahpalem village. From there autos and busses will be available to go to Tada waterfalls.  It is 35 kilo metres from Srikalahasti (Chittoor dist). Rainy season is not suitable to visit this place.