header

Papikondalu Tourism / పాపికొండలు

papikondalu tourism

Papikondalu Tourism / పాపికొండలు
పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి.
ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు.
పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు, ఎలుగుబంట్లు, ముళ్లపందులు,అడవిపందులు ఇంకా వివిధరకాల పక్షులు,విషకీటకాలు, వేలాది రకాల ఔషధమొక్కలు, వృక్షాలు ఉన్నాయి.
పాపికొండల మధ్య గోదావరి నది తక్కువ వెడల్పుతో రమణీయంగా ఉంటుంది. లాంచీల మీద రాజమండ్రి నుండి చేసే పాపికొండల ప్రయాణం యాత్రికులకు ఒక మరపురాని అనుభూతి.
సీతారామయ్యగారి మనుమరాలు, అంజి, గోపి, గోపిక, గోదావరి వంటి సినిమాలు ఈ ప్రాంతంలోనే తీసారు.
పాపికొండల యాత్ర : పాపికొండల యాత్ర రాజమండ్రిలోని పట్టిసీమ రేవు, పోలవరం రేవు మరియు పురుషోత్తమపట్నం రేవు నుండి ప్రారంభమవుతుంది. పోలవరం ప్రాజెక్ట్, గండిపోచమ్మ గుడి మీదుగా బోటు ప్రయాణిస్తుంది. దారిలో దేవీపట్నం, కొరటూరు కాటేజస్, కొల్లూరు వెదురుతో నిర్మించిన హట్స్ ను బోటులో నుండి చూడవచ్చును. చివరగా ఖమ్మం జిల్లా పేరంటాలపల్లి దగ్గర బోటు ఆగుతుంది. అక్కడ సుందరమైన దృశ్యాలను యాత్రికులు చూసిన తరువాత బోటు తిరిగి వెనుకకు మరలుతుంది. పేరంటాలపల్లిలో స్థానికులు వెదురు చేసిన అలంకరణ వస్తువులను అమ్ముతారు. ఈ ప్రయాణం ఉదయం 7 గంటల నుండి సాయత్రం 7 గంటల దాకా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు ప్రైవేట్ బోట్లలో ప్రయాణం చేయవచ్చు. ఉదయపు పలహారం, మధ్యాహ్న భోజనంతో కలిపి టికెట్ ధర ఉంటుంది.

Papikondalu Tourism
Papikondla mountain range of dense forests in the Eastern Ghats. Papikondas spread in Khammam, East Godavari, and West Godavari districts. Most of them are in east and west Godavari districts.
Peaceful and pleasant weather is owned by Papikondalu. The trees in the papikondalu forest do not rotate leaves. With hills and waterfalls it seems completely rural atmosphere. It is called as Andhra Kashmir while atmosphere is very cool in summer season.
Papikonda forests hosts tigers, black tigers, bisons, foxes, wolves, deer, monkeys, bears, hedgehogs, wild boars and various kinds of birds. Thousands of medicinal plants and trees are seen here
The Godavari River flows from amidst of Papikondalu hills. The Papikondara journey from Rajahmundry on the boat is an unforgettable experience for tourists.
Seetaramaiah gari manavaralu, Anji, Gopi, Gopika and Godavari movies were pictuarised in this area. Papikondala tours begins from Pattiseama coast in Rajahmundry, Polavaram coast and Purusottampatnam coast. Boat passes over the Polavaram Project and Gondi Pochamma temple. Boat stops at Gandi Pochamma temple while the tourists have to see goddess Gandi Pochamma.
Devipatnam, Koratooru Cottages, Kollur Bamboo Huts are seen on the way from the boat.
Finally the boat will stop at Parantallapalli in Khammam district. The pilgrims will enjoy scenic scenery here. Lord Shiva Temple, Ramakrishna Paramahamsa Asramam and a water fall is other visiting places at Perantalapalli. Local villagers in parentalapally sell decorative items made from bamboo.
Then the boat starts return journey to Rajahmundry. This journey will begins from 7 am and ends at 7pm. Andhra Pradesh tourism department and many other private operators will run boats. Ticket cost includes breakfast and lunch.