క్రీస్తుపూర్వం 6వ శతాబ్ధంలో గౌతమబుద్ధునిచే భారతదేశంలో స్థాపించిన మతం. ఈ మతాన్ని అనుసరించేవారేని బౌద్దులు అంటారు.
క్రీ.పూ.269-232 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన అశోక చక్రవర్తి వలన ఆగ్నేయ ఆసియాలో పలుప్రాంతాలకు విస్తరించింది. వాటిలో శ్రీలంక, బర్మా, ఇండోనేసియా, కంపూచియా, ధాయ్ లాండ్, తూర్పు ఆసియాలోని చైనా, టిబెట్ దేశాలున్నాయి. ఈనాటికి కూడా ఈ దేశాలవారు బౌద్దమతాన్ని అనుసరిస్తున్నారు.
మానవుడు జనన మరణ అవస్థలనుండి విముక్తి పొందటానికి జ్ఞానమొక్కటే సులువైన మార్గమని బౌద్దమత ధర్మసూత్రాలు సూచిస్తున్నాయి. కోరికలు వాంఛలతో కూడిన మానవ జీవితం బాధాకరమైనదని ఈ బాధలకు మూలం అవిద్య అని బౌద్దం బోధిస్తుంది.
బుద్దునిచే బోధించబడిన అష్టాంగ మార్గాలు – మంచి మాట, మంచి కృషి, మంచి జీవనం, మంచి ధ్యానం, మంచి నిర్ణయం, మంచి నడత, ఆత్మపరిశీల అనేవి మానవుని కష్టాలు ఛేదించే మార్గాలని బౌద్దం సూచిస్తున్నది.ఇదే మానవుని సుఖ జీవనమార్గమని బౌద్దం బోధిస్తున్నది. బుద్ధుని మరణానంతరం బౌద్ధం హీనయానం, మహాయానం అనే రెండు శాఖలుగా విడిపోయింది.
ఎవరికివారు వ్వక్తిగతంగా కృషిచేసి ముక్తి పొందాలనేదే హీనయాన మత సారాంశం.(దీనినే తెరవాడ బౌద్దం అంటారు.) రెండవదైన మహాయానం ముక్తిమార్గం ఎంపికచేసుకున్న మతంలో విశ్వాసం ఉంటే చాలునని తెలుపు తుంది. చైనా, టిబెట్, జపాన్ దేశాలలో ఈ శాఖను అనుసరిస్తున్నారు.
ఒకప్పుడు భారతదేశమంతా వ్యాప్తిచెందిన ఈ మతం ప్రస్తతం భారతదేశంలో ఈ మతం నామమాత్రంగా ఉంది. మొగస్తనీస్ – క్రీ.పూ.302, పాహియాన్, హూయాన్ స్వాంగ్, ఇత్సింగ్ వంటి విదేశీ యాత్రికుల వలన బుద్ధ చరిత్ర వివరాలు తెలుస్తున్నాయి. 7వ శతాబ్దంలో భారతదేశంలో బౌద్దమతం క్షీణ దశకు చేరుకుంది. ఈ దశలోనే వజ్రయాన శాఖ అవతరించింది. టిబెట్, మంగోలియా దేశాలలో అనుసరిస్తున్న లామాయిజం, జపాన్ వారు అనుసరిస్తున్న జెన్ బౌద్దం, బౌద్ద మతంలోని ఇతర శాఖలు.