క్రైస్తవమతానికి ఆద్యుడు జీసస్ క్రైస్త్. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ఏసుక్రీస్తు తాను ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యబృందానికి చేసిన బోధనల ఆధారంగా వెలసిన మతం క్రైస్తవ మతం.
ప్రపంచం మొత్తం మీద సుమారు వందకోట్ల మందికి పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.
దాదాపు ఒకటవ శతాబ్ధంనుండి ఈ మత ప్రభావం ప్రభుత్వాల పైన, సృజనాత్మక కళలపైనా, మేధావులపైనా ప్రభావం చూపించింది. సర్వమానవ సౌభ్రాతృత్వం, కరుణ, ప్రేమ వంటి ఉదాత్త భావాలు ఈ మతానికి ప్రాతిపదికలు. ఈ మతానికి పవిత్ర గ్రంధం బైబిల్. క్రిస్టమస్ మరియు గుడ్ ఫ్రైడే వీరికి ముఖ్యమైన పండుగలు. భారతదేశంలోని మెదక్ పట్టణంలో ఉన్న వెసీలియన్ చర్చ్ చాలా పెద్దది. రోమ్ నగరంలోని సెంట్ పీటర్స్ చర్చ్ ప్రపంచలోనే పేరు గాంచినది. రోమన్ కేథలిక్ ల పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీలోని చర్చ్ కి పోప్ పీఠాధిపతి.
క్రైస్తవులు బైబిల్ లోని న్యూటెస్ట్ మెంట్ ను అనుసరిస్తారు. ప్రొటెస్టంట్స్, బాప్టిస్ట్, పెంతేకోస్త్, ఆర్ధడాక్స్ చర్చ్, సెవన్త్ డే ఎడ్వన్టింటిస్ట్ చర్చ్ మొదలగునవి క్రైస్తవ మతంలోని ప్రధానమైన శాఖలు.