header

Gautama Buddha….Founder of Buddha eligion...గౌతమ బుద్ధుడు....

బౌద్ధ మతం స్థాపించిన మహానీయుడు గౌతమ బుద్ధుడు. ఇతను క్రీ.పూ. 567 సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. ఇతని జన్మస్థలం లుంబినీ. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మాయాదేవి. శుద్దోదనుడు నేపాల్ లోని కపిలవస్తు పురానికి మహారాజు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్ధుడు. ఇతన పుట్టిన ఏడవరోజున తల్లి మరణించటంతో ఇతనిని పినతల్లి పెంచి పెద్ద చేసింది. సిద్ధార్ధుడు శాంత స్వభావం కలవాడు, మితభాషి, సమస్త ప్రాణికోటి పట్ల అపారమైన ప్రేమను చూపేవాడు. తండ్రి కోరిక ప్రకారం యశోధర అనే రాకుమారిని వివాహమాడతాడు. వీరికి రాహులుడు అనే పుత్రుడు పుడతాడు.
క్రమంగా సిద్దార్ధునికి బాహ్య సుఖాల పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది. శారీరక సుఖం స్థిరం కాదనే అభిప్రాయం బలపడింది. ఒకనాడు రథం మీద నగరంలో విహారానికి వెళ్లినపుడు ఒక వృద్ధుడు, ఒక రోగి తరువాత శవయాత్ర కనబడతాయి. తన రథసారధి చెన్నుని ద్వారా ప్రతి జీవికి ముసలితనం, మరణం తప్పదని తెలుసుకుంటాడు. దీనితో ఇతనిలో అంతర్మధనం ఏర్పడుతుంది. తన 29వ ఏట భార్యను, 7 రోజుల ప్రాయం గల కుమారుని వదలి అర్ధరాత్రి సమయంలో రహస్యంగా బయలు దేరి సత్యాన్యేషణకు అరణ్యానికి చేరుకుంటాడు.
దీనినే మహాభనిష్ర్కమణ అంటారు. అరణ్యంలో తపస్సు ప్రారంభిస్తాడు. ఇంద్రియాలను అరికట్టి తనను తాను తెలుసుకోవాలనే కోరికతో కఠిన సాధన చేస్తాడు. కౌండిన్యుడనే గురువు వద్ద మరో ఐదుగురితో కలసి ఆహారాన్ని కూడా త్వజించి శరీరాన్ని శుష్కింపచేసుకొని కఠోరసాధన చేస్తాడు. చివరకు ఒకరోజున నదిలో స్నానం చేస్తుండగా నీరసంతో పడిపోతాడు. అప్పుడు తను అనుసరించే మార్గం సరైనదని కాదని తెలుసుకుంటాడు.
తరువాత బుద్ధగయలో బోధివృక్షం కింద భగవత్ ధ్యానం ప్రారంభిస్తాడు. ఇతనికి తన 35వ ఏట జ్ఞానోదయమవుతుంది. అప్పటి నుండి సిద్ధార్ధుడు గౌతమ బుద్ధుడయ్యాడు. ప్రతి బుద్ధునికి ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. తరువాత తన 45 సం.ల జీవితంలో గంగానది పరివాహక ప్రాంతాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, దక్షిణ నేపాల్ ప్రాంతలలో తన శిష్యులతో సహా పర్వటించి తన సిద్ధాంతాలను బోధిస్తాడు. బౌద్దమతంలో కుల, మత, వర్గ విభజనలు లేకపోవటంతో అనేకవేల మంది బౌద్దమతంలో చేరతారు. బుద్ధుని బోధనలు త్రిపీటకాలలో పొందుపరచబడ్డాయి.
కుశీనగరంలో తన 88వ సంవత్సరంలో కుంద అని కుమ్మరి సమర్పించిన ఆహారం స్వీకరించి అస్తత్వత పాలౌతాడు. (ఈ ఆహారం విషపూరితమైనది అవటం వలన) తర్వాత గౌతమబుద్ధుడు నిర్వాణం చెందుతాడు.
తర్వాత అశోక చక్రవర్తి కాలంలో బౌద్దమతం శ్రీలంకతో పాటు చైనా, జపాన్ ఇంకా అనేక దేశాలలో వ్యాప్తి చెందింది. క్రమేణా దేశదేశాలకుప్రాకి ఏ ఇతరమత ధర్మానికి లభించనంతటి వ్యాప్తిని సంపాదించింది. బైద్ధ ధర్మంలో హృదయ పారిశుద్యం, విశ్వప్రేమ ప్రధాన సూత్రాలు. బుద్దుని తథాగతుడని కూడా పిలుస్తారు. ఈనాటికి టిబెట, చైనా, జపాన్, శ్రీలంక, ధాయ్ లాండ్, ఇంకా అనేక దేశాలలో బౌద్దమతం ఆచరణలో ఉంది.