header

Prophet Muhammad…Founder od Islam Religion... మహమద్ ప్రవక్త ....

Prophet Muhhamad ఆధునికులు ఇతనిని ఇస్లాం మత స్థాపకుడు అంటారు కానీ ఇస్లాం మతం ఇంకా ప్రాచీనమైనది. ఆదం-అవ్వ కాలంనుండే ప్రారంభమైనదంటారు. ఇతను ఇతని కాలానికి ఉన్న చిన్న చిన్న తెగలను రూపుమాపి ముస్లిం సమాజాన్ని స్థాపించాడు.
ఇతను ఇస్లాం మతానికి చివరి మహా ప్రవక్త. ఇతను క్రీ.శకం 571 సంవత్సరంలో బాగ్దాద్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి అబ్దుల్లా, తల్లి ఆమ్నా. ఇతని తండ్రి ఇతను పుట్టేటప్పటికే మరణిస్తాడు. తల్లి ఇతని ఆరవ సంవత్సరంలో మరణిస్తుంది. 12వ ఏట తన పినతండ్రితో కలసి వ్యాపారం మొదలు పెట్టారు. మెక్కా గ్రామంలో ఒక ధనవంతుని కుమార్తెతో ఈయనకు వివాహం జరిగింది, మక్కాకు సమీపంలోని హీరా పర్వత గుహకు తరచు వెళ్లి దైవప్రార్థన, దైవ ధ్యానంలో గడుపుతూ ఉండటం మహమ్మద్ కు చిన్నతనం నుంచి అలవాటు. ఒక్కొక్కప్పుడు ఆయన అక్కడే గడుపుతూ ఉండేవాడు.
తనకు కలుగుతున్న దివ్యానుభవాలను ఇతరులకు వినిపిస్తూ ఉండేవాడు. మతమంటే పరిశుద్ధమైన నైతిక జీవనమని, రక్తమాంసాల బలి భగవంతుడు అంగీకరించడని ఆయన తెలిపారు. మహ్మద్ చదువుకున్నవాడు కాదు. సమాధి స్థితిలో ఇతను చెప్పే విషయాలను, పద్యాలను మిత్రులు వ్రాసుకునేవారు. ఈ విధమైన ప్రవచనాలే ఖురాన్ లో 114 అధ్యాయాలుగా రూపొందాయి. మక్కాలో తన వ్యరేకులను ఎదుర్కుంటూనే 13 సంవత్సరాల పాటు మత ప్రచారం సాగించాడు. తరువాత తన మకాం మదీనా పట్టణానికి మార్చాడు. అక్కడ ప్రచారం పూర్తి అయిన తరువాత చివరి రోజులలో తిరిగి మక్కా చేరుకున్నాడు. ప్రార్థనా సమావేశాలను తానే నడుపుతూ ఉండేవాడు. తన స్వీయ రక్షణకు మరియు మస్లింల రక్షణకై అనేక చిన్న చిన్న యుద్దాలు చేసాడు. అన్నింటిలోనూ విజయాలు సాధించాడు. తానుగా ఎవరిమీదా దండయాత్ర చేయలేదు కానీ తనమీదకు వచ్చిన శత్రువును ఎదర్కునేందుకు మాత్రమే యుద్ధాలు చేసాడు. ఇతని ప్రభావంవలన అరేబియాలో చిన్న చిన్నతెగలు పోయి అరేబియా అంతా ముస్లిం రాజ్యంగా మారింది.
ఇతను మొదట ముగ్గురు బిడ్డల తల్లైన 45 సంవత్సరాల విధవరాలును తన 25వ ఏట వివాహం చేసుకున్నాడు. తరువాత 10 మందిని వివాహం చేసుకున్నాడంటారు.
క్రీ.శకం 632 జూన్ నెలలో తన 63వ ఏట మహ్మద్ పరమపదించారు. మరణ సమయంలో ఆయన నోటివెంట భగవంతుడు నాకు పరమ మిత్రుడు అనే మాట వెలువడింది.