header

Aristotle….అరిస్టాటిల్

ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రీక్ తత్త్వవేత్త, దార్శనికుడు. ఇతను క్రీస్తు పూర్వం 384 లో ఏజియన్ సముద్రపు ఉత్తరాన ఉన్న మాసిడోనియా రాజ్యంలో ఉన్న స్టాగీరా నగరంలో జన్మించాడు. వీరిది ధనిక కుటుంబం. ఈయన తండ్రి అలెగ్జాండర్ తాతగారి దగ్గర ఆస్థాన వైద్యుడుగా పనిచేసాడు.
అరిస్టాటిల్ కు చిన్నతనం నుండి ప్రకృతి, విజ్ఞానం పట్ల ఆసక్తి అధికంగా ఉండేది. తన 17వ ఏట ఉన్నత విద్యకోసం ఏధెన్స్ నగరానికి వెళ్లాడు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లేటో అనే గ్రీక్ తత్త్వవేత్త వద్ద విద్యార్ధిగా చేరాడు.
ఆతరువాత అరిస్టాటిల్ గొప్ప తత్త్వవేత్తగాను, ఉపదేశకుడుగానూ పేరు పొందాడు. ప్రపంచంలోని అనేక రాజ్యల మీద దండెత్తిన అలగ్జాండర్ అరిస్టాటిల్ శిష్యుడే. అప్పటికి అలగ్జాండర్ వయసు కేవలం 14 సంవత్సరాలే. తన గురువైన అరిస్టాటిల్ కు శాస్త్రీయ పరిశోధలకు అవసరమైన నిధులు సమకూర్చేవాడు. అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్-2 హత్యకు గురికావటంతో అలెగ్జాండర్ రాజ్యాధికారాన్ని చేపట్టటంతో చదువు ఆగిపోయింది. అరిస్టాటిల్ తిరిగి ఏధెన్స్ చేరుకొని లైజన్ అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, తన జీవితాంతం పరిశోధలు సాగించాడు
. అరిస్టాటిల్ గొప్ప వేదాంతి మరియు గొప్ప శాస్త్రవేత్త కూడా. జంతువులపై ఆయన విశేషమైన పరిశోధనలు చేశాడు. వాటిని వర్గీకరించటంలో ఇతును రూపొందించిన పద్దతులే ఇప్పటికీ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు. జంతువుల దేహాలు కోసి పరీక్షలు జరిపే పద్దతులను కూడా ఈయన రూపొందించినవే. అరిస్టాటిల్ ఎన్నో గ్రంధాలు వ్రాయడమే కాకుండా సుమారు 1,000 గ్రంథాలు గల గొప్ప గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రాచీన పాశ్ఛాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడంటారు. తత్త్వశాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేశాడు.
క్రీ.పూర్వం 322 వ సంవత్సరంలో అరిస్టాటిల్ మరణించాడు.