
ఇతను ఫ్రెంచ్ తత్త్వవేత్త, మహామేధావి, విద్యావేత్త. ఇతను ప్రవచించిన సిద్ధాంతాలు సుమారు 200 సంవత్సరాలపాటు ప్రపంచ రాజకీయ భావాలను ప్రభావితం చేశాయి.
1776లో జరిగిన అమెరికా విప్లవం, 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవానికి రూసో భావాలే మూలకారణం. 1762 సం.లో సోషియల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో మానవుడు స్వేచ్ఛేజీవిగా జన్మించాడు. కానీ ప్రతిచోటా అతను శృంఖలాబద్దుడై కన్నిస్తున్నాడు అని తెలిపాడు.
వ్యక్తి స్వాతంత్ర్యం గురించి నొక్కి చెప్పాడు. అతి కీలకమైన ఈ ప్రగతి శీలక రాజ్యభావం వైపు పెక్కుమంది ఆకర్షింపబడ్డారు. ఈ భావం మేధావులను ఆలోచింపచేసింది.
ఈయన చెప్పిన రెండు భావాలు భావకుల్ని ప్రభావితం చేయడమే గాక, ప్రపంచంలో నేడు పెక్కుదేశాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలుగా పరిణమించడానికి వీలైంది.