header

Leo Tolstoy…లియో టాల్ స్టాయ్.....

మహామేధావి, సంఘసంస్కర్త, ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ రచయుత టాల్ స్టాయ్. ఇతని పూర్తిపేరు నకోలోవిక్ టాల్ స్టాయ్. ఇతని కాల్పనిక రచనలలో 1869 సం.లో వ్రాసిన యుద్దం – శాంతి గొప్పనవల. 1877 సంవత్సరంలో వ్రాసిన ‘అనాక రెనీనా’ టాల్ స్టాయ్ కు కీర్తి తెచ్చిన ప్రేమ గాథ. ఇతని మొదటి రచనలు పసితనం -1852, బాల్యం-1854, యౌవనం – 1857 వెలుగు చూశాయి. 1855 వ్రాసిన సెవాస్టీపూల్ గాథలు. 1862లొ వ్రాసిన కోసానిక్ యుద్దం-శాంతిలో రష్యాపై నెపోలియన్ చేసి దండయాత్ర ప్రధాన కథావస్తువు.
1880 సం. ఆధ్యత్మిక చింతనకు లోనైప్పటి నుండి కాల్పనిక రచనా వ్యాసాంగానికి టాల్ స్టాయ్ స్వస్తి పలికాడు. అప్పటినుండి నైతిక విలువల మీద, ధార్మిక చింతన మీద సమాజ పరమైన ఇతివృత్తాలమీద ఈయన తన దృష్టిని కేంద్రీకరించాడు. వాటిలో ఏ కన్టెషన్ – 1882, వాట్ ఐ బిలీవ్,-1884, వాట్ దే మస్ట్ డూ – 1894 ముఖ్యమైనవి. 1896 సం.లో ఈయన దృష్టి మరలా కాల్పనిక రచనలవైపు మళ్లింది. దిపవర్ ఆఫ్ డార్క్ నెస్ – 1886 అనే నాటకం, నికోట్టర్ సోనాటా – 1891, రిసరెక్షన్ -1899 అనే నవలలూ ఈ విధమైన రచనలలో పేర్కొనదగినవి. లివింగ్ కార్ప్స్ (బతికి ఉన్న శవం) టాల్ స్టాయ్ మరణంతరువాత వెలుగులోనికి వచ్చింది. .
1828 సెప్టెంబర్ 9న ఇతన తులా రాష్ట్రంలో జన్మించాడు. టాల్ స్టాయ్ కజాన్ యూనివర్శిటీలో విద్య అభ్యసించాడు. రష్యన్ సైన్యంలో స్వచ్ఛంద సైనికుడుగా చేరి 1855లో క్రిమియా యుద్ధం సెవాస్టిపోల్ ముట్టడిలో ధైర్యసాహసాలతో పోరాడాడు. .
జీవితధ్యేయాన్ని మార్చుకొని నైతిక విలువలను గూర్చి ఆలోచించాడు. మంచి చెడ్డా, వివేకం, ఇహలోక జీవిత పరమావధిని తెలుసుకొనే విచక్షణా జ్ఞానం భూమిమీద పుట్టిన ప్రతి వ్యక్తి స్వభావసిద్ధంగా ఉంటుందని టాల్ స్టాయ్ భావన. 1890 సంవత్సరంనాటికి మానసిక పరిపక్వతను సాధించి ఆస్తిపరుడుగా ఉండటానికి ఇష్టపడక తన యావదాస్తిని భార్యకూ, 9 మంది సంతానానికి పంచి పెట్టాడు. తన రచనలమీద వచ్చే ఆదాయాన్నికూడా వదులుకున్నాడు. .
అతని రచనల ప్రచురణ భాధ్యతను ఇతని భార్య చేపట్టింది. ఇతను మాత్రం తనకంటూ ఏమీ ఉంచుకోకుంటా జీవనం సాగించాడు. .
ఏరూపంలో ఉన్న హింసనైనా టాల్ స్టాయ్ ఖంఢించేవాడు. పొగత్రాగటం, మధ్యపానం వదలి పెట్టి శాఖాహారిగా మారాడు. నిరాడంబరంగా, రైతుకూలీలతో కలసి కష్టించేవాడు. దుస్థిలో ఉన్నవారిని ఆదుకునేవాడు. .
సమాజంలో ఆడా, మగా తమ తమ వక్యిగత జీవితాలలో కర్వవ్యనిష్టతో జీవిస్తూ పరస్పరం గౌరవాభిమానాలనాలతో జీవించమని బోధించాడు. కానీ ఇటువంటి అసాధారణ భావాలు ఇతని ఆత్మీయులతోనే వివిదాలకు లోనయ్యేవి. .
తన 82వ ఏట స్వజనాన్ని విడచిపెట్టి తిరగటం మొదలుపెట్టాడు. 1919 నవంబర్ 22వ తేదీన అస్తాపోవూ అనే రైల్వే స్టేషన్ లో దిక్కులేని మరణానికి గురయ్యాడు. ప్రపంచమంతా ఈయన మానవతా వాదానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్వించింది.