header

Maxim Gorky… మాగ్జిం గోర్కీ...

సుప్రసిద్ధ రష్యన్ నవలా రచయిత. ఇతని అసలుపేరు విలెగ్జె నికోలాబ్ విచ్ ప్యేన్ కోవ్. బాగ్జిమ గోర్కీ ఇతన కలం పేరు. చాలా కష్టపడి పైకి వచచాడు. ఆత్మ స్థైర్యం కలవాడు. లెనిన్ కు మిత్రుడు.తన రచనల మూలంగా రష్యా నుండి బహిష్కరించబడి అమెకా వెళ్లి అక్కడవారితో కూడా సరిపడక ఇటలీలోని కెప్రీ నగరం చేరాడు. 1907లో స్యచరిత్ర రచించాడు.
1907 సంవత్సరంలో స్వీయ చరిత్రను రాసుకొన్నాడు. 1913 సం.లో రష్యాకు తిరిగి వచ్చి లెటోపిన్ అనే పత్రికను స్థాపించాడు. 1917 అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ రష్య ప్రభుత్వానికి సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా ఉన్నాడు. ఇతని ప్రసిద్ధ రచన అమ్మ. ఈ రచన తెలుగులోకి కూడా అనువదింపబడింది.
గోర్కీ కథానికలు కూడా బహుళ ప్రచారం పొందాయి.
ఈయన జన్మస్థలం అయిన నిజ్నీ నవూగ్రోడకు గోర్కీ పట్టణం అని పేరుపెట్టి గౌరవించారు.