header

Michelangelo….మైఖెలేంజెలో...

ఇతను ప్రముఖ చిత్రకారుడు, శిల్పి. ఇతను ఇటలీ దేశానికి చెందినవాడు. ఇతను 1475 మార్చి 6వ తేదీన ఇటలీలో జన్మించాడు.రాళ్లపని చేసుకునే తన దాది వలన శిల్పకళలో అభిరుచిని పెంచుకున్నాడు. మొదట్లో డొమినికా గిర్లాండోలో పనిచేసాడు.
మధ్య యుగపు మత విశ్వాసం, సనాతన సంప్రదాయం, పునరుజ్జీవన శక్తి అన్నీ మేళవించి ఇతనిని సుప్రసిద్ధ శిల్పిగా తీర్చిదిద్దాయి.
సిస్టీన్ ఛాపెల్ కప్పు లోపల ఆరువేల చదరపు అడుగుల మేర చిత్రించిన కళాఖంఢం ఈయనకు అఖంఢ కీర్తిని తెచ్చిపెట్టింది. లాస్ట్ జడ్జ్ మెంట్, సెయింట్ పీటర్స్ లోని సీయోటా చలువ రాతి శిల్ప విగ్రహం, డేవిడ్ శిల్పం – ఫారెన్స్ అకాడమీ, బ్రహ్మాండమైన మోజెస్ విగ్రహం, మెడిసీ కుటుంబం, సమాధులకై సిద్ధపరచిన పగలు, రాత్రి, సంధ్యాచ్చాయ, ప్రాతఃకాలం వంటి సంకేత కళాఖంఢాలు మైఖెలేంజెలో ప్రతిష్టను ఆకాశానికి తీసుకువెళ్లాయి. 16వ శతాబ్దంలో ఈ కళాకారుడుకి లభించిన కీర్తి ప్రతిష్టలు మేరే కళాకారుడుకి లభించలేదు.