
20వ శతాబ్ధంలో సుప్రసిద్ధ వర్ణ చిత్రకారుడుగా పేరుపొందిన పికాసో1881 సం.లో స్పెయిన్ లోని మాలగా అనే గ్రామంలో జన్మించాడు.
1904 నుండి 1973 మద్యకాలం తన జీవితాన్ని ఫ్రాన్స్ లో గడిపాడు. పికాసో బాల మేధావి. చిన్నతనంలోనే 1901-1904 మధ్యకాలంలో నీలం రంగుతోనే ఎక్కువ వర్ణ చిత్రాలు రూపొందించాడు. వీటిలో తల్లిప్రేమ ప్రముఖమైన చిత్రం. 1906 లో డెమోసెల్లీ అవిగ్నాన్ చిత్రం చిత్రించినప్పటినుండి ఇతని కీర్తి లభించింది.
తరువాత క్యూబిజమ్ అనే నూతనశైలిని సృష్టించాడు. 1937 సం.లో గూర్నెకా ను చిత్రించాడు. గూర్నికా ఒక ప్రముఖ కళాఖంఢం. 1937సం. ఏప్రియల్ లో జర్మన్ మిత్రపక్షాలు గుయోరినకో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేయగా, నిరసనగా ఈ చిత్రాన్ని చిత్రించాడు. 1945 తరువాత వర్ణ చిత్రాలతో పాటి శిల్ప, పింగాణీ కళలవైపు కూడా దృష్టిని మరలించాడు.
పికాసో 1973వ సంవత్సరంలో మరణించాడు.