
ప్లేటో ప్రాచీన గ్రీక్ తత్త్వవేత్త. పాశ్చాత్య సంస్కృతికి గట్టి పునాదులు వేసిన మహామేధావి. ఇతని ఆలోచనలు, రచనలూ గత 2000 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని ప్రభావితం చేస్తూ వచ్చాయి.
ప్లేటో అసలు పేరు అరిస్టోక్లేట్. ప్లేటో అంటే విశాలమైన భుజాలు కలవాడు అని అర్ధం. క్రీస్తుపూర్వం 427 సంవత్సరంలో ఏధెన్స్ నగరంలోని ఒక భాగ్యవంతుల కుటుంబం జన్మించాడు.
ప్లేటో గురువు సోక్రటీస్. ప్లేటో శిష్యులలో ప్రముఖుడు అరిస్టాటిల్. ఏదెన్స్ లోని ప్లేటో అకాడమీ ఈయన కార్యస్థానం.
ప్లేటో చేప్పిన గురు-శిష్య సంవాదాలు నేటికీ శిరోధార్యాలే. క్రీ.పూర్వం 357 సంవత్పరంలో ప్టేటోచే స్థాపించబడిన అకాడమీలో ఖగోళశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, రాజనీతి శాస్త్రం వంటి రంగాలలో మౌలికమైన విషయాలమీద ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు చర్చాగోష్టులు జరుపుతూ ఉండేవారు. ప్లేటో తన అకాడమీలో స్త్రి, పురుషులకు సమానమైన అవకాశాలు కల్పించాడు. ప్లేటో మరణం తరువాత కూడా ఈ అకాడమీ ఎనిమిదిన్నర శతాబ్దాల పాటు కొనసాగింది. దేశ, విదేశ రాజులు ప్లేటోను రాజ్యాంగపరమైన సలహాలు కోరువారు.
ప్లేటో తన భావాలను ప్రవచించటానికి చేపట్టిన సాహిత్య ప్రక్రియను డైలాగ్ – సంవాదం అంటారు. ఇద్దరి మద్యగానీ అంతకంటే ఎక్కువమంది మధ్యగానీ జరిగే సంభాషణనే సంవాదం అంటారు.
విమర్శలు, సమీక్షలు నాటకీయంగా ఉండేవి. అపాలజీ, క్రీటో, ది రిపబ్లిక్, సింపోసియం వంటి 35 డైలాగులు ప్లేటో రచించినట్లు తెలుస్తుంది. నీతిశాస్త్రం, మానవధర్వశాస్త్రం వీటిలో ప్రధాన వస్తువులు.
క్రీస్తుపూర్వం 347 సంవత్సరంలో ఒక స్నేహితుని ఇంటిలో వివాహనికి వెళ్లి విందు తీసుకున్న తరువాత మరణిస్తాడు.