
ఇను ఇంగ్లండ్ దేశానికి చెందిన సుప్రసిద్ద సాహిత్యవేత్త, మహాకవి, నాటక రచయిత. ఇంగ్లండ్ లోని స్టాట్ ఫర్డ్ ఆక ఎనాన్ అనే చోటు ఇతని జన్మస్థలం. ఇతని తల్లి ఆర్దెన్, తండ్రి జాన్ షేక్స్ పియర్.
ఇంగ్లీష్ సాంస్కృతిక పునరజ్జీవనం పొందుతున్న రోజులలో ఇతను అండన్ నగరం చేరుకుని గ్లోబ్ ధియేటర్ లో ఒక నాటక రచయితగానూ, నటుడుగాను చేరాడు. ఇతని కలం నుండి వెలెవడిన 38 నాటకాలు రంగస్థల నిర్వాహకులు ప్రదర్శించేవారు.
ఇతను మరణించిన తరువాత 1623 సం.లో ఇతని 36 నాటకాలను సంకలించి మొదటిసారిగా ఫోలియోగా ప్రచురించారు.
ఇందులో 16 నాటకాలు క్వార్టరుగా షేక్స్ పియర్ జీవితకాలంలోనే ప్రచురితమయ్యాయి. ఇందులో సుఖాంతాలు, విషాదాంతాలు, చారిత్రతాత్మక నాటకాలు వంటివి ఉన్నాయి.
లవ్స్ లేబర్స్ లాస్ట్, కామెడీ, ఆఫ్ ఎరర్స మొదటి నాటకాలు. తరువాత ది టూ జెటిల్ మెన్ ఆఫ్ వెరోనా, రోమియో అండ్ జూలియట్ వ్రాశాడు.
హెన్రీ -6, రిచర్డ్ -3, టేమింగ్ ఆఫ్ ది ష్రూ, కొంగ్ జాన్, మర్చంట్ ఆఫ్ వెనిస్, ఏమొడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ హెన్రీ-4, మెర్రీ వైన్స ఆఫ్ విండ్సర్, హెన్రీ -5, యాజ్ యూ లైక్ ఇట్, ట్వెల్త్ నైట్, మచ్ ఎడో ఎబైట్ నధింగ్ వీటిని వ్రాసారు.
తరువాత జూలియస్ సీజర్, హేమ్లెట్, త్రో యిలస్ –క్రెసిడా, ఓథెల్లో, మెషర్ ఫర్ మెషర్, మేక్బెత్, కింగ్ లియర్, టైమన్ ఆఫ్ఏధెన్స, పెరికల్స, ఆంటోని అండ్ క్లియోపాత్రా, కిరయో లినన్, సింబలీన్, వింటర్స్ టేల్, ది టెంపెన్ట్, హెన్రీ – 8, టూనోబుల్ కిన్స్ మన్ నాటకాలు వ్రాసాడు. ఇవన్నీ ఇతనికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.
షేక్స్ పియర్ నాటకాలన్నింటిలోనూ భాషాప్రయోగంలోనూ, పాత్రపోషణలోనూ, నాటకీకరణలోనూ తనకు తనే సాటి అనిపించుకున్నాడు. 1616 . ఏప్రియల్ 23వ తేదీన మరణించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. స్టాట్ ఫర్డ్ ఆన్ ఎనాన్ లో షేక్స్ పియర్ జన్మించిన స్థలంలో కట్టబడిన ఇతని స్మారక చిహ్నం ప్రపంచ సాహితీపరులకు, రంగస్థల కళాకారులకు దర్శనీయమైనది.