header

Socrates… సోక్రటీస్

సోక్రటీస్ ప్రసిద్ధిపొందిన గ్రీక్ తత్త్వవేత్త. ఇతను క్రీస్తుపూర్వం 469 లో ఏధెన్స్ పట్టణంలో జన్మించాడు. తండ్రి షోఫర్మకస్. తల్లి ఫెనార్టీ మంత్రసాని. తండ్రి శిల్పవిద్యలో నేర్పరి. కాంతకాలం సోక్కటీస్ తండ్రి శిల్ప వృత్తిని చేపట్టి సుమారు 40 సంవత్సరాల వయసులో పైన్యంలో చేరాడు. కొంతకాలం అక్కడ పనిచేసి పోటెడియా, డెలీయమ్, ఆంఫీపోలీస్ దండయాత్రలలో పేరు తెచ్చుకున్నాడు.
ఇతను గొప్ప వక్త, ఇతని పల్లెటూరి వాలకం, నిరాడంబరత దేశంలో జనాలకు విడ్డూరంగా ఉండేది.
ప్లేటో, జెనోఫాన్ ఇతని శిష్యులు. ఏధెన్స్ న్యాయసభలో సభ్యుడై ఉండగా ఒక నేరస్థునికి విధించబడిన మరణదండన అక్రమమని చెప్పి ఆ తీర్పును వ్యతిరేకించాడు.
ఏదెన్స్ పట్టణ న్యాయపరిపాలకులలో ఒకడుగా పనిచేస్తూ ఉండగా అక్రమంగా కొన్ని నిర్భంధాలు జరపటానికి సోక్రటీసును నియమించారు. తాను ఆపని చేయకపోతే తన ప్రాణం మీదికి వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా సోక్రటీసు ఆ అక్రమమైన పనులు చేయటానికి నిరాకరించాడు. సోక్రటీస్ యదార్ధవాదిగా ఉండటం వలన అనేకమంది ఇతనికి శత్రువులుగా మారారు.
సోక్రటీస్ 70వ యేట క్రీ.పూర్వం 399 సంవత్సరలో సోక్రటీస్ మీద రెండు నేరాలు మోపి మరణదండన విధించారు
. న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు, మరణదండనకు బదులు మరేదైన శిక్ష అమలుపరచమని అర్ధించటానికై జైలునుండి తప్పించుకొని దేశాంతరం వెళ్లమని కోరిన స్నేహితుల కోరికను తిరస్కరించాడు. న్యాయస్థానం తీర్పునకు లోబడటమే ధర్మం అని అన్నాడు. కొద్దిసేపట్లో మరణదండన అమలు చేస్తారనగా నిశ్చలంగా నిర్విరామంగా తనను చూడవచ్చిన వారితో మాట్లాడాడు. మరణ దండన అమలుపరచడానికి ఇచ్చే హెమ్ లాక్ విషపాత్రను చేతిలో ఉంచుకుని ఎలాంటి తడబాటు లేకుండా గడగడా త్రాగి కీర్తిశేషుడయ్యాడు.
సోక్రటీస్ శిష్యులైన ప్లేటో, జెనోఫాన్ లు జరిపిన సంభాషణలు నేటికి మనకు లభిస్తున్నాయి.