header

Amsterdam (Netherlands) ఆమ్ స్టర్ డామ్

 Amsterdam (Netherlands) ఆమ్స్టర్డామ్ ఐరోపా ఖండంలో ఉన్న దేశం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ నెదర్లాండ్స్ దేశంలోని ప్రముఖ నగరం.
ఈ ప్రాంతంలో ప్రవహించే ఆమ్స్టల్ నది పేరు మీద దీనికీ పేరు వచ్చింది.
నెదర్లాండ్స్ రాజధాని ఇదే అయినప్పటికీ ఈ దేశ పార్లమెంటు, ప్రభుత్వ కార్యకలాపాలు ఏవీ ఇక్కడ జరగవు. ఈ దేశ పశ్చిమ తీరంలో ఉన్న హాగ్ నుంచి జరుగుతాయి.
ఇక్కడ ఆదాయం తక్కువగా ఉన్న వారికి ప్రభుత్వం కొన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తుంది. ఇలాంటివారి పెంపుడు జంతువులకూ ఏడాదికో సారి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తుంది. పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య అధికం. . 20 నుంచి 25 ఏళ్ల మధ్య వాళ్లయితే ఎక్కువగా ఉన్నారు. ఈ వయసు వారిలో ప్రతి వంద మంది పురుషులకూ 145 మంది స్త్రీలున్నారు.
ఇక్కడ పైకి కనబడకుండా భూమిలోకి నీటి కుళాయిలుంటాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సైతం తాగు నీరు ఉండా
లన్న ఉద్దేశంతో వీటిని పూర్వమే ఇలా ఏర్పాటు చేయబడ్డవి. ఆమ్స్ స్టర్ డాం లో తేనెటీగల జాతులు చాలా ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేక పూల తోటల్ని నగరం మధ్య మధ్యలో పెంచుతుంటారు. తేనెటీగలకు హాని చేసే ప్రమాదకర పురుగు మందుల వాడకం నిషేధం.
డచ్ వాళ్లకి స్పానిష్ వాళ్లకి జరిగిన యుద్ధాల్లో ఆమ్స్టర్డామ్ కీలకంగా ఉండేది. దాదాపు ఈ ఇద్దరి మధ్యలో 80ఏళ్లపాటు యుద్ధం కొనసాగింది . దాంట్లో భాగంగా స్పానిష్ రాజులు ఇక్కడ పడవల్ని తయారు చేయించుకునేవారు. వాటిని డచ్ తిరుగుబాటుదారులు ధ్వంసం చేసేసేవారు.
ఇక్కడున్న పాత ఇళ్లు దాదాపుగా చెక్క స్తంభాలపై కట్టినవే. ఇక్కడ ఒక్కటే ప్యాలస్ ఉంది. అదే డాం స్క్వేర్లో ఉన్న ‘ద రాయల్ ప్యాలస్’. నిజానికి ఇది ఒకప్పుడు రాజభవనం కాదు. 1806 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సిటీ హాల్. తర్వాత నెపోలియన్ సోదరుడు లూయిస్ తనని తాను రాజుగా ప్రకటించుకుని దీన్ని రాజమందిరంగా వాడుకున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడిదే. 1602లో ప్రారంభమైంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని ప్రారంభించింది. ఇక్కడ ఒక్కటే ప్యాలస్ ఉంది. అదే డాం స్క్వేర్లో ఉన్న ‘ద రాయల్ ప్యాలస్’. నిజానికి ఇది ఒకప్పుడు రాజభవనం కాదు. 1806 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సిటీ హాల్. తర్వాత నెపోలియన్ సోదరుడు లూయిస్ తనని తాను రాజుగా ప్రకటించుకుని దీన్ని రాజమందిరంగా వాడుకున్నాడు.
ఆమ్స్టర్డామ్ మంచి నగరంగా అభివృద్ధి చెందిందిగానీ 1850ల్లో ఇక్కడ 30శాతం జనాభా యాచకులుగానే ఉండేవారు. ఈ నగరం నిండా కాలువలుఎక్కువ. మొత్తం 165 ఉన్నాయి.వీటి వల్ల ఇక్కడ 90 ద్వీపాలు, వాటిపై 1500 వంతెనలూ ఉన్నాయి.
ఈ కాలువల్లో చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఇంకా వీటిల్లో లాంచీలు, బోట్లు నడుస్తుంటాయి. మొత్తం 100 కిలోమీటర్ల వాటర్వేస్ ఉన్నాయి.వీటి చుట్టుపక్కలున్న ప్రాచీన భవనాలు, ప్రాంతాల్ని కలిపి 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఆమ్స్టర్డామ్ లో 63 శాతం మందికిపైగా స్థానికులు రోజూ సైకిల్ తొక్కుతారు. అందుకే ఇక్కడ 500 కిలోమీటర్లకుపైగా సైకిల్దారులున్నాయి.రోడ్లు, కాలువలు, వీధులు ఎక్కడ చూసినా వరుసగా పార్కింగ్ చేసిన సైకిళ్లే కనబడుతుంటాయి.ప్రజా రవాణాలో అత్యధికంగా 32శాతం మంది వీటినే ఉపయోగిస్తారు. పర్యాటకులు కొంచెం రుసుము చెల్లించి సైకిళ్లపై నగరంలో తిరగవచ్చు.