header

Durban ..South Africa..డర్బన్‌…దక్షిణ ఆఫ్రికా

Durban ..South Africa..డర్బన్‌…దక్షిణ ఆఫ్రికా డర్బన్‌... దక్షిణ ఆఫ్రికా దేశంలో మూడో పెద్ద నగరం.ఈ నగర విస్తీర్ణం 2,292 చ.కి.మీ. జనాభా షుమారుగా 34 లక్షలు వరకు ఉండవచ్చు.
ఈ నగర ఉనికిని మొదటి సారిగా పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డి గామా 1497లో మొదటిసారిగా క్రిస్మస్‌ రోజున కనిపెట్టటం జరిగింది.
1824లో ఈ నగర ప్రాంతంలో బ్రిటిష్‌వాళ్లు కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. పోర్ట్‌ నటాల్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1835లో డర్బన్‌ అని పేరు మార్చటం జరిగింది.
1860లో భారతీయులను ఈ ప్రాంతంలో చెరుకు సాగుచేయటానికి తీసుకొచ్చారు. అలా వచ్చిన వారు ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ భారత సంతతి వారు ఎక్కువ. భారత సంస్కృతీ సంప్రదాయాలూ కనిపిస్తాయి. రెస్టారెంట్లు, హోటళ్లలో భారత దేశ వంటకాలు లభిస్తాయి. చర్చి, మసీదు, ఆలయాలు ఉన్నాయి.
నగరంలోని గేట్‌వే షాపింగ్‌ సెంటర్‌ ఆఫ్రికాలోనే పెద్ద షాపింగ్‌ సెంటర్‌. 350 దుకాణాలు, 70 రెస్టారెంట్లు, 18 థియేటర్లు, థీమ్‌ పార్కుతో సందడిగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తయిన ఇండోర్‌ క్లైంబింగ్‌ రాక్‌ కూడా ఈ నగరంలోనే ఉంది.
నగరంలోరి మోసెస్‌ మబిదా స్టేడియం ఎన్నో కార్యక్రమాలకు, బంగీ జంప్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి ఎన్నో ఆటలకు వేదిక.
ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద అక్వేరియం ఈ నగర ప్రాంతంలోనే ఉంది. దీని పేరు యుషాకా మెరిన్‌ వరల్డ్‌. 32 ట్యాంకులు, రెస్టారెంట్లు ఉన్నాయి. డాల్ఫిన్లు అదనపు ఆకర్షణ దక్షిణ ఆఫ్రికాలో రద్దీగా ఉండే నౌకాశ్రయంగా డర్బన్‌ ప్రసిద్ధి. ప్రపంచంలోనూ తొమ్మిదో అతి పెద్ద నౌకాశ్రయం ఈ నగరమే.దక్షిణ ఆఫ్రికాలో మొదటి స్టీమ్‌ రైల్వే మొదలైంది ఈ నగరంలోనే
సౌత్ ఆఫ్రికాలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా దీనికి పేరు. అందమైన సముద్ర తీర ప్రాంతాలతో పర్యటకుల్ని రప్పించుకుంటోంది ఈ నగరం. గోల్డెన్‌ మైల్‌ బీచ్‌.. రాత్రి వేళల్లోనూ రంగు రంగుల కాంతులతో ప్రకాశిస్తుంది.
గాంధీజీ 1893లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ఈ నగరంలోనే. ఈ నగరాల్లోని కొన్ని రహదారులకు, చౌరస్తాలకు గాంధీజీ పేరు పెట్టారు. గాంధీజీ విగ్రహాలు, గాంధీజీ పేరుతో మ్యూజియం కూడా ఉంది.