header

Florence City…Italy….ఫ్లోరెన్స్‌

Florence City…Italy….ఫ్లోరెన్స్‌ ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్‌ నగర విస్తీర్ణం 102.32 చ.కి.మీ. జనాభా 3,80,000 సుమారుగా.
క్రీస్తు పూర్వం 59లోనే ఈ నగరం నిర్మితమైన ఈ నగరం ఫ్లుయెంటి, ఫ్లోరెంటియా అనే రెండు నదుల మధ్యలో ఏర్పడింది. ఈ నదుల పేర్ల మీదనే దీనికి ఫ్లోరెన్స్‌ అనే పేరొచ్చిందంటారు. ఫ్లోరెన్స్‌లో నివసించే ప్రజల్ని ఫ్లోరెన్‌టైన్స్‌ అని పిలుస్తారు. ఇటలీ మధ్యలో ఉన్న టుస్కానీ ప్రాంతానికి ఈ నగరం రాజధాని
రినైసెన్స్‌ ఆర్ట్‌కి ఇది ప్రసిద్ధి. ఈ కళకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాలరీ ఒకటి ఇక్కడుంది. వుఫుజి గ్యాలరీగా పిలుస్తారు దీన్ని.
మోనాలిసా చిత్రపటాన్ని చిత్రించిన ప్రముఖ కళాకారుడు లియోనార్డో పుట్టింది ఈ నగరంలోనే. అర్నో నది ఈ నగరంలో ప్రవహిస్తుంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోని లోయలోనే లియోనార్డో 1452లో జన్మించారు.
ఈ నగరం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. అక్కడున్న నాలుగు ప్రముఖ చర్చిల పేర్ల మీదనే ఆ ప్రాంతాల్నీ పిలుస్తారు.
వెస్పుకి అనే వ్యక్తి ఇప్పుడు మనం వాడుతున్న పియానోని మొదటగా తయారు చేసిందిక్కడే. ఇటాలియన్‌ భాష పుట్టినచోటు ఇదేనని ఆధారాలు చెబుతున్నాయి.
కళలు, కళాకారుల నగరంగా గుర్తింపు పొందింది. యునెస్కో దీన్ని ‘ఆర్ట్‌ ట్రెజర్‌’గా అభివర్ణించింది. ఇక్కడి ఆర్ట్‌ గ్యాలరీలు, విగ్రహాలు, ఆర్కిటెక్చర్‌ని చూసేందుకు పర్యటకులు వస్తుంటారు. ఏటా ఇక్కడికి కోటి మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలోయుద్ధ ప్రభావం ఈ నగరంపై ఎక్కువగా పడింది. జర్మన్‌ వారు ఇక్కడి మంచి ప్రఖ్యాత కట్టడాల్ని నాశనం చేశారు. చాలా వంతెనల్ని కూల్చేశారు. ఒక్క పొంటె వెచియో బ్రిడ్జిని తప్ప. ఎందుకంటే అది హిట్లర్‌కీ తెగ నచ్చేసింది. ఇది కూల్చడానికి వీలు లేనంత అందంగా ఉందని చెప్పి దీన్ని మాత్రం వదిలేశారు.
ఇక్కడున్న అతి పెద్ద క్యాథడ్రల్‌ చర్చి డ్యూమో ప్రముఖ పర్యటక ఆకర్షణ. 1296లోఈ చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇది పూర్తవడానికి 140 ఏళ్లు పట్టింది. చర్చి పైకి 463 రాతి మెట్లుంటాయి. మెట్లెక్కి పైకి చేరుకుంటే నగరం మొత్తాన్ని పై నుంచి చూడవచ్చు