header

Iquitos….Peru…ఇక్విటస్‌

Iquitos….Peru…ఇక్విటస్‌ పెరూ దేశంలోని ఇక్విటస్‌ నగరం ఒక అడవి పట్టణం. అమెజాన్‌ నది పరివాహక ప్రాంతంలోనే ఈ నగరం ఉంది. ననయ్‌, ఇటాయా అనే రెండు నదులూ ఈ నగరం దగ్గరే కలుస్తాయి. అందుకే ఈ నగరానికి ఒకవైపు మొత్తం నీళ్లుంటాయి. మిగతా వైపులా దట్టమైన అమెజాన్‌ అడవి ఉంటుంది.
ఇక్విటస్‌ నగరంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తుంటారు. అన్ని నగరాలలో ఉన్నట్లే స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు సౌకర్యాలూ ఉంటాయి. కానీ నగర ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా... పడవలలో లేక హెలీకాఫ్టర్‌ లాంటి వాటిల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీనికి కారణం ఈ నగరానికి వేరే ఏ ప్రాంతాన్నీ కలుపుతూ రోడ్లు ఉండవు. స్థానికంగా తిరుగటానికి మాత్రం రోడ్లు ఉంటాయి
ఒకప్పుడు ఇక్కడ స్థానిక తెగల ప్రజలుండేవారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచీ వచ్చి స్థిరపడ్డారు. రబ్బరు, కలప పరిశ్రమలు, పర్యాటకం వల్ల ఈ నగరం ఆర్థికంగా బలపడింది.
ఇక్విటస్‌ కు దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. నగరానికి ప్రత్యేక ఆకర్షణ అమెజాన్‌ నది, అడవి. ఫ్లోటింగ్‌ హోటల్‌, బటర్‌ఫ్లై జూ వంటివీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.