header

Lisbon City…Portugal..లిస్బన్‌ నగరం...

Lisbon City…Portugal..లిస్బన్‌ నగరం... లిస్బన్‌ నగరం పోర్చుగల్ దేశపు రాజధాని. ఈ నగర విస్తీర్ణం 100 చ.కి.మీ. జనాభా షుమారు 5 లక్షలు. దేశంలో పెద్దనగరంకూడా లిస్బనే అంతేకాకుండా ప్రాచీన నగరంగా కూడా పేరుపొందిందిఈ నగరానికి సెవెన్ హిల్స్ నగరంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే నగరం మొత్తం ఏడు కొండలమీద కట్టబడింది.1755 సం.లో వచ్చిన పెద్ద భూకంపం వలన ఈ నగరంలోని చాలా పురాతన భవంతులు నేలమట్టమయ్యాయి.
నగరంలోని శాంటా ఎన్‌గ్రేసియా చర్చి 17వ శతాబ్ధంలో నిర్మాణం మొదలు పెట్టి 20వశతాబ్దంలో నిర్మాణం పూర్తి అయింది. ఈ విషయం గిన్నిస్ రికార్డులో నమోదు అయింది.
నగరవాసులు కాకులను అభిమానిస్తారు. కాకులను పెంపుడు పక్షులు లాగా పెంచుకుంటారు. ఈ నగరానికి గుర్తు కూడా కాకే. పన్నెండో శతాబ్ధంలో ఉన్న మతపెద్ద విన్ సెంట్ మీద అభిమానంలో వీరు కాకులను విన్ సెంట్ అని పిలుస్తారు.
నగరంలోని ఓషనేరియం ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియంల్లో ఒకటి. ఎనిమిది వేలకు పైగా రకాల సముద్రపు జీవుల్ని ఇందులోఉన్నియొ. 16వేలకు పైగా జీవులున్నాయిందులో.
ఇక్కడ ప్రసిద్ధ కళ గ్రాఫిటీ. భవంతుల నుంచి వీధుల్లోని గోడల వరకు, రోడ్ల నుంచి వంతెనల వరకూ అన్నీ పెయింటింగ్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఏటా 40లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు. బెలమ్‌ టవర్‌ ప్రముఖ పర్యటక ఆకర్షణ కేంద్రం. టాగూస్‌ నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చిన వారు దీని అందమైన వాస్తు కళను చూడ్డానికే వస్తుంటారు. రోడ్డు మీదా, నీళ్లలోనూ ప్రయాణించగల హిప్పో బస్‌ ఇక్కడుంది. పర్యటకులూ దీనిలో ఓ రైడ్‌కి తప్పనిసరిగా వెళ్లొస్తుంటారు.
నగరంలో అందరికీ నోరూరించే వంటకంగా పేస్టీస్‌ దెనాటాకు పేరుంది. స్థానిక బేకరీలన్నింటిలోనూ దొరికే తీపి పదార్థం ఇది. కస్టర్డ్‌పౌడర్‌తో తయారు చేస్తారు. ఇక్కడున్న వాస్కోడీగామా బ్రిడ్జ్‌ ఐరోపాలోనే అతి పొడవైనది. పదిహేడు కిలోమీటర్ల పొడవుంటుంది.
రియో డి జనీరోలో ఉన్న యేసుక్రీస్తు విగ్రహానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాన్ని సందర్శించిన పోర్చుగీసు మత పెద్ద ఇలాంటిది తమ ఊరిలోనూ ఒకటి ఉంటే బాగుండును అనుకున్నారు. తర్వాత అచ్చంగా అలాంటి దాన్నే ఇక్కడా తీర్చిదిద్దారు.