header

London..England… లండన్‌

London..England… లండన్‌ ఇంగ్లాండ్ దేశ రాజధాని లండన్. ఈ నగరాన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని ధనిక నగరాల్లో లండన్ ఒకటి. ఈ నగర విస్తీర్ణం 1,572 చ. కిలోమీటర్లు. జనాభా సుమారు 88 లక్షలు.
సంస్కృతి పరంగా లండన్‌ ఎంతో వైవిధ్యం ఉన్న నగరం. వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఈ నగరంలో మాట్లాడే భాషల సంఖ్య 300. వీటిల్లో బెంగాలీ, గుజరాతీ, పంజాబీ వంటి భారతీయ భాషలు కూడా ఉన్నాయి. కానీ ఈ నగరంలో నివసించే స్థానికులకు తెల్లజాతివారిమనే అహంకారం ఎక్కువ. నల్లవారిని తక్కువగా చూస్తారు.
ప్రపంచంలో ఎక్కువగా పర్యాటకులను ఆకట్టుకునే నగరం లండన్. 2014 సంవత్సరంలో కోటీ 60 లక్షల మంది సందర్శించారీ నగరాన్ని.
ఈ నగరంలో అన్నీ ప్రత్యేకతలే. లండన్‌ నగరం మీదుగా థేమ్స్‌ నది ప్రవహిస్తుంటుంది. లండన్‌ బ్రిడ్జ్‌ ప్రత్యేక ఆకర్షణ. బిగ్‌ బెన్‌... ప్రపంచంలో గంటలు కొట్టే అతి పెద్ద నాలుగు ముఖాల గడియారం. లండన్‌ వీధుల కింద ఇంచుమించు 20 భూగర్భ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
పార్లమెంట్‌ హౌస్‌ను అధికారికంగా ‘ది ప్యాలస్‌ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌’ అంటారు. దేశంలోనే అతిపెద్ద భవంతి ఇది.