header

Mumbai….బొంబాయి

Mumbai….బొంబాయి‌ భారతదేశంలోని బొంబాయి మహానగరం మహారాష్ట్ర రాజధాని. అరేబియా సముద్రపు తీరాన కలదు. భారతదేశపు మహానగరాలలో పెద్దది. పేరుపొందిన వాణిజ్య కేంద్రం భారతదేపు మొత్తం అంతర్జాతీయ వ్యాపారంలో సగం పైగా బొంబాయి మీదుగానే జరుగుతుంది.
1534 సం.లో గుజరాత్ సుల్తాన్ ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్ వారికి ఇచ్చాడు. 1661 గాంజా యువరాణి కేధరిన్ ను ఇంగ్లండ్ చక్రవర్తి ఛార్లెస్ 2 వివాహమాడటంతో ఈ ప్రాంతం స్త్రీధనంగా బ్రిటీష్ వారి ఆధీనంలోకి వచ్చింది.
భారదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం బొంబాయి. చలన చిత్ర (సినిమాలు) పరిశ్రమకు కూడా ప్రసిద్ధి గాంచినది. హిందీ సినిమాలు ఎక్కువగా ఇక్కడే చిత్రీకరించబడతాయి.
బొంబాయిలో మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు. స్టేడియంలు ఉన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం, మహాలక్ష్మి దేవాలయం బొంబాయిలో పేరుపొందిన దేవాలయాలు.
బొంబాయికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలిఫెంటా గుహలు కలవు. ఈ గుహలు శిల్పకళా ఖండాలకు ప్రసిద్ధి చెందినవి.