నీస్ నగరం ఫ్రాన్స్ దేశంలోని పేరుపొందిన పర్యాటక నగరం. మధ్యధరా సముద్ర తీరంలో ఉండే అందమైన నగరం.
నగర విస్తీర్ణం 71.92 చదరపు కిలోమీటర్లు జనాభా దాదాపు మూడున్నర లక్షలు (2019). ఈ నగరానికి నీస్ లా బెల్లే అనే పేరు కూడా ఉంది. ‘నీస్ అంటే అందమైనది’ అని అర్థం.
ఐరోపాలోని పురాతనమైన నగరం నీస్. క్రీస్తుపూర్వం 350లోనే గ్రీకులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు.
ఈ నగరం ఇటలీకి దగ్గర్లో ఉండటం వలన చాలామంది జనాభా ఇటాలియన్ కూడా మాట్లాడతారు.. ఈ నగర చరిత్రలో ఇటలీ పాత్ర చాలానే ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటాలియన్ రుచులు లభ్యమవుతాయి. స్కూళ్లలో ఇంగ్లిషుతో పాటు ఇటాలియన్ భాష కూడా నేర్పుతారు.
చాలాకాలం పాటు ఇటలీ భూభాగంలో ఉండేది ఈ నగరం. 1860లో ఫ్రాన్స్‌లో కలిసింది.
నగరంలోని ఫైనిక్స్ పార్క్ ఫ్లోరా ఐరోపాలోనే అతిపెద్ద గ్రీన్ హౌస్. దీంట్లో 2,500 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి.
ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో, ప్రముఖ రచయిత ఫిట్జిరాల్డ్ ఈ నగరంలో నివసించినవారే.
ఫ్రాన్స్‌లో ఎక్కువ మ్యూజియాలున్న నగరాల్లో నీస్ ఒకటి.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మధ్యలో రెండు వారాల పాటు భారీ ఎత్తున కార్నివాల్ జరుగుతుంది. వేలాది మంది సంగీతకళాకారులు, డ్యాన్సర్లు వస్తారు. దేశదేశాల నుంచి లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ వేడుకను 1294వ సంవత్సరం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ నగరంలోని సముద్ర తీరాలు నున్నని రాళ్లతో అందంగా ఉంటాయి. వీటిని రాక్‌ఫిల్ల్‌డ్ బీచ్‌లు అంటారు.
ఫ్రాన్స్ మొత్తంలో ట్రాఫిక్‌లైట్లు ఈ నగరంలోనే ఎక్కువ.