header

Oakland City..Newzeland… ఆక్లండ్‌

Oakland City..Newzeland… ఆక్లండ్‌ ‌ ఆక్లండ్‌ నగరం న్యూజీలాండ్‌ దేశంలోని పేరుపొందిన నగరం మరియు న్యూజీలాండ్‌ దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి ఆక్లండ్‌. ఈ నగర విస్తీర్ణం1,102 చ. కి. నగరజనాభా పదిహేను లక్షలు. సహజసిద్ధంగా ఏర్పడిన రెండు హార్బర్‌ల మధ్యలో ఈ నగరం ఉంటుంది.
ఈ నగరంలో భూమి ఎక్కువ, జనాభా తక్కువగా ఉన్నారు. నీలి రంగులో నిర్మలంగా ఉండే సముద్రపు నీరు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ.
వేసవిలో కూడా ఉష్ణోగ్రత సరాసరిన 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది. చలికాలంలో అయితే 8 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఏటా 20లక్షల మందికి పైగా పర్యటకులు ఈ నగరానికి వస్తారు.
నగరంలో చాలామంది ధనికులు ఉన్నారు. ప్రతి ముగ్గురు ఆక్లండ్‌ వాసుల్లో ఒకరికి సొంత బోటు ఉంది. రకరకాల చోట్ల నుంచి వచ్చిన వారితో, విభిన్న భాషలు మాట్లాడే వారితో ఈ నగరం కోలాహలంగా ఉంటుంది. ఈ నగరం అగ్నిపర్వతాలకు పేరు. 50 వరకూ అగ్ని పర్వతాలున్నాయి. భయపడక్కర్లేదులేండి.కానీ పర్యతాలన్నీ పేలే స్థితిలో లేవు. గతంలో ఎప్పుడో చిందిన లావా, మాగ్మాలతో ఇక్కడ అందమైన మైదానాలు ఏర్పడ్డాయి. ఆ అగ్ని పర్వత బిలాల్ని ఇప్పటికీ చక్కగా చూడొచ్చు. నగరంలో దాదాపు 40వేల హెక్టార్లలో పార్కులున్నాయి.
ఈ నగరానికి ‘సిటీ ఆఫ్‌ సెయిల్స్‌’ అనే పేరూ ఉంది. సెయిలర్లను ఎక్కువ ఆకర్షిస్తుండటంతో దీనికీ పేరొచ్చింది. ఎటు చూసినా నీరు కనిపిస్తుంటుంది. పర్వతాలు, మడ అడవులతో నిండి ఉంటుంది.
నగరంలో ఎక్కువగా ఆడే ఆటలు రగ్బీ, క్రికెట్‌, హైకింగ్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, స్కీయింగ్‌, వైట్‌వాటర్‌ రేఫ్టింగ్‌.
పసిఫిక్‌ సముద్రం నుంచి 16 కిలోమీటర్లు నడిస్తే టాస్మాన్‌ సముద్రం వచ్చేస్తుంది. మధ్యలో ఉండే కొండలు, గుట్టలు ఎక్కుతూ చాలా మంది హైకింగ్‌ చేస్తూ తీరం నుంచి మరో తీరానికి వెళతారు. రకరకాల పెంగ్విన్‌ జాతులు ఇక్కడ పెరుగుతున్నాయి. అంటార్కిటికా బయట పెంగ్విన్ లను ఇక్కడ చూడొచ్చు
దక్షిణార్ధ గోళంలోనే అతి ఎత్తయిన టవర్‌ ఉన్నదిక్కడే. దీని పేరు ‘ద స్కై టవర్‌’. 328 మీటర్ల ఎత్తుంటుంది. ఇదెక్కి చూస్తే ఆక్లండ్‌ చుట్టుపక్కల 80 కిలోమీటర్ల మేర చక్కగా కనిపిస్తుంది. దీంట్లో మంచి మంచి రెస్టారెంటులూ ఉన్నాయి. .