ఓస్లో మహానగరం నార్వే దేశ రాజధాని కూడా. నగర జనాభా ఆరు లక్షల 73వేలు నగర విస్తీర్ణం 480 చ. కి. ఈ నగరం క్రీస్తు శకం 1000లో వ్యాపార కేంద్రం కోసం స్థాపించబడింది.. ప్రపంచ అందమైన నగరాల్లో ఓస్లో కూడా ఒకటి.
నార్వే దేశ భాష నార్వేజియన్. వీరి కరెన్సీ నార్వేజియన్ క్రోన్స్.
నగర విస్తీర్ణంలో 242 చదరపు కిలోమీటర్ల మేర అడవివ్యాపించి ఉంది.
నగరంలో 343 సరస్సులున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం నివసించడానికి అత్యుత్తమమైన నగరం ఓస్లో. మానవాభివృద్ధి సూచీలోనూ ముందుంది. నిరుద్యోగం చాలా తక్కువ. ఖరీదైన నగరాల్లో ఒకటి. ఇక్కడున్న పర్యాటక ప్రాంతాల్ని చూసేందుకు ఏటా కోటి మందికి పైగా వస్తుంటారు
నార్వే వాతావరణం కూడా భిన్నంగా ఉంటుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వలన . ఆరు నెలలు సూర్యుడు ఈ ధ్రువానికి దగ్గరగా ఉంటాడు. దీంతో వేసవిలో ఓస్లోలో ఎప్పుడూ పూర్తిగా చీకటి రాదు. రాత్రీ వెలుతురుంటుంది.
నార్వేలో చల్లని వాతావరణమే ఉంటుంది. సరాసరిన వేసవిలో అంటే.. జూన్, జులై, ఆగస్టుల్లో అత్యధికంగా 21డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మైనస్ డిగ్రీల్లోనే ఉంటాయి.
ఈ నగరం ఆగ్నేయ భాగాన్ని ఓస్లోఫ్జోర్డ్ పేరుతో పిలుస్తారు. ఇక్కడ కొంత భూ భాగంలోకి సముద్రం ముందుకు వచ్చి ఉంటుంది. ఈ తీరంలో ఇంచుమించు 40 దీవులున్నాయి. చుట్టూ కొండలు, అడవులు, బీచ్‌లతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది. దీంతో ఇది ప్రధాన పర్యటక ఆకర్షణ ప్రాంతంగా అభివృద్ధి చెందింది..
ఏటా డిసెంబర్ 10న నోబెల్ శాంతి బహుమతుల ప్రదానోత్సవం ఈ నగరంలోనే జరుగుతుంది.
విగలాండ్ స్పార్కెన్ విగ్రహాల పార్కు విగ్రహాల పార్కుగా పేరొందింది... పార్కు లోపల ఎక్కడ చూసినా విగ్రహాలే కనిపిస్తాయని. మొత్తం 212 కాంస్య, గ్రానైట్ విగ్రహాలున్నాయిక్కడ. ఇలాంటి పార్కుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది.
వీటంన్నింటిని ఒకే వ్యక్తి రూపొందించటం విశేషం. ఆయన పేరు గుస్తావ్ విగలాండ్.
నగరంలో నేషనల్ థియేటర్ ఉంది. ఇది నార్వేలోనే అతిపెద్ద థియేటర్. 1899లో నిర్మించబడింది. సాంస్కృతిక కార్యక్రమాలకు ఇందులో ప్రత్యేకంగా వేదికలుంటాయి.