రోమ్ అతి ప్రాచీన చరిత్ర కలిగిన మహానగరం. ఇటలీ దేశానికి రాజధాని. రోమన్ కేధలిక్ చర్చీకి, పోప్ లకు నివాసం కావటం వలన రోమ్ ను హోలీ సిటి అని అంటారు.
రోమ్ లోనే కేధలిక్ లకు పవిత్ర యాత్రాస్థలమైన వాటికన్ సిటీ ఉంది. సెయింట్ పీటర్స్ చర్చ్ కూడా రోమ్ లోనే ఉంది. అపురూప వస్తుసముదాయం, వర్ణచిత్రాలు ఈ చర్చిలో చూడవచ్చు.
లియోనార్డ్ డావెన్సీ, మెకెల్ యాంజిలో, రాఫియల్ వంటి సుప్రసిద్ధ కళాకారుల కళాఖంఢాలు ఈ చర్చ్ లలో ఉన్నాయి.
వాటికన్ సిటీలోని చర్చి సైకప్పులో మైకెల్ యాంజిలో కుడ్యచిత్రం చిత్రించబడి ఉంది. ఇక్కడ ఉన్న కాపిలో లీనే మ్యూజియం చాలా పురాతనమైనది.
ఇవే కాకుండా విల్లా గుయిలియాలోని నేషనల్ మ్యూజియం, బోర్గీస్ సంగ్రహం, నేషనల్ రోమన్ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ వంటివి వినోద పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
15వ శతాబ్ధంలో నిర్మించిన టెనీజియా రాజప్రసాదం వాస్తుకళకు పేరుపొందినది. పేంతియన్ లో రోమన్ దేవతా విగ్రహాలు ప్రదర్శించబడతాయి. నీరో రాజప్రసాదం, మాడోనూ రాజప్రసాదం, గారీ బాల్డీ స్మారక చిహ్నం, కోలోసియం మార్కస్ అరీయస్థూపం, అగస్తస్ సమాధి (క్రీ.పూ.28సం.) రోమ్ నగరంలో చూడదగ్గవి.
రోమ్ నగర విస్తీర్ణం 1500 చ.కి.మీటర్లు.