header

San Francisco… America…శాన్‌ఫ్రాన్సిస్కో

San Francisco…  America…శాన్‌ఫ్రాన్సిస్కో అమెరికాలోని ప్రముఖ నగరాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో ఒకటి. నగర విస్తీర్ణం 600 చదరపుకిలో మీటర్లు నగర జనాభా: 9 లక్షలు ఈ నగరం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పసిఫిక్ మహా సముద్రతీరంలో ఉంది.
ఈ నగరం 1848 జరిగిన మెక్సికో-అమెరికా యుద్ధంముందు వరకు మెక్సికో దేశంలోని భాగం. అప్పట్లో దీని పేరు యెర్బా బ్యూనా. ఆయుద్ధం తరువాత పేరు మారి అమెరికాలో కలిసిపోయింది.
ఈ నగరంలో మొత్తం 50 కిపైగ కొండలున్నాయి. దీనివలనే ఇక్కడ వాలుగా, ఒంపులు ఒంపులు తిరిగి ఉండే వీధులు ఎక్కువ.
ఈ నగరం పర్యాటక పరంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడిన హోటల్స్ కలవు. అత్యంత ధనిక నగరం కూడా
దాదాపుగా జూన్‌, జులై, ఆగస్టుల్లోనే ఇక్కడ మంచు కనిపిస్తుంది. మిగిలిన అమెరికా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ రోజులే మంచు ఉంటుంది. చారిత్రక కట్టడాలకు ఇది ఈ నగరం పేరు. 200కి పైగా చారిత్రక భవనాలున్నాయిక్కడ.
నగర విస్తీర్ణంలో 11శాతం పార్కులే ఉన్నాయి. ఆసియా బయట ఉన్న రెండో అతి పెద్ద చైనా టౌన్‌ ఉన్నదిక్కడే. ఇది ఉత్తర అమెరికాలో ఉన్న అతి ప్రాచీన చైనా టౌన్‌. లక్షమందికి పైగా చైనీయులు నివసిస్తున్నారిక్కడ. అమెరికాలో అతి పెద్ద, పాత జపాన్‌ టౌన్‌ ఉన్నదిక్కడే.
నగరానికి దాదాపుగా 50మైళ్ల ఈ పసిఫిక్‌ సముద్ర తీరం ఉంది. ఇది సొరచేపలకు పెట్టింది పేరు. మనుషుల్ని తినేసే రకాలూ ఇక్కడున్నాయి. ఈ తీరమంతా పెద్దగా లోతు కూడా ఉండదు. దీని సరాసరి లోతు స్విమ్మింగ్‌ పూల్‌ లోతు ఉండవచ్చు. ఎక్కడైనా సరే 12 నుంచి 15 అడుగులలోపే. .
నగరంలో రెండు ప్రధానమైన వంతెనల్లో గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ ఒకటి. 1933లో దీని నిర్మాణం మొదలుపెట్టి 1937లో పూర్తిచేశారు. ఈ తీర భూకంపాలు ఎక్కుద. కానీ అవన్నీ రిక్టరు స్కేలుపై మూడులోపే ఉంటాయి.
ఆహార ప్రియుల ఈ నగరం చిరునామా. 3,500కి పైగా రెస్టారెంటులున్నాయి.
మొదట డెనిమ్‌ జీన్స్‌ని పెద్దఎత్తున తయారు చేయడం మొదలు పెట్టింది ఇక్కడే. గోల్డ్‌ రష్‌ కాలంలో మైనర్లకు ఎక్కువ కాలం మన్నే దుస్తుల్ని రూపొందించాలన్న ఉద్దేశంతో వీటిని తయారు చేశారు.
ఇక్కడి చారిత్రక వ్యవస్థల్లో శాన్‌ఫ్రాన్సిస్కో కేబుల్‌కార్లు కూడా ఒకటి. గంటకు 9.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇవి ప్రస్తుత కాలంలో కూడా పని చేస్తున్నాయి.
శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గర్లో రెడ్‌వుడ్‌ చెట్ల అడవులున్నాయి. ప్రపంచంలో అతి ఎత్తయిన చెట్లు ఇవి