header

Sydney…Australia… సిడ్నీ నగరం.

Sydney…Australia… సిడ్నీ నగరం. ‌ ఆస్ట్రేలియా దేశంలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. ఈ నగర విస్తీర్ణం 12,367.7 చ.కిలోమీటర్లు నగర జనాభా: 5,131,326. నగరంలో విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఇంగ్లిష్‌, అరబిక్‌, మాండ్రిన్‌, గ్రీకు, వియత్నామీస్‌లను ఎక్కువగా మాట్లాడతారు.
వర్తక వ్యాపారాలతో ఇది ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక కేంద్రంసిడ్నీ. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ఈ నగర పాత్ర కీలకం.
ఈ నగరం పర్యాటక పరంగా కూడా పేరు గాంచింది. సిడ్నీకి కోటీ యాభై లక్షల మందికి పైగా స్వదేశీ, విదేశీయులు వస్తున్నారు. అందమైన బీచ్‌లు, ఒపేరా హౌస్‌, హార్బర్‌ బీచ్‌లాంటి వాటికి పర్యాటకులుఎంతగానో ఆకర్షితులవుతున్నారు.
సిడ్నీ హార్బర్‌ సహజంగా ఏర్పడ్డ లోతైన హార్బర్లలో ప్రపంచంలోనే మొదటిది. సిడ్నీ టవర్‌ ఇక్కడ అతి పొడవైనది. ఆస్ట్రేలియాలో ఉన్న వాటిలో రెండోది.
క్రికెట్‌ అంటే సిడ్నీలో నివసించే వారికి చాలా అభిమానం. 2014లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో కొన్ని మ్యాచ్‌లకు వేదికయ్యింది. ఇక్కడి హార్బర్‌ బీచ్‌ వంతెన ప్రత్యేక ఆకర్షణ. పొడవైన ఉక్కు ఆర్చితో కట్టిన బ్రిడ్జిగా ఇది గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. 1932లో దీన్ని ప్రారంభించారు. స్థానికంగా ‘ద కోట్‌ హ్యాంగర్‌’ అని పిలుచుకుంటారు.
నూతన సంవత్సర వేడుకలు హార్బర్‌బీచ్‌ సమీపంలో ఏటా అద్దిరిపోయే సంబరాలతో మొదలు పెడతారు. టపాకాయల వెలుగుల్లో, అవి చేసే శబ్దాల హోరులో సిడ్నీ అత్యంత సందడిగా ఉంటుంది.. కేవలం ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా పర్యాటకులు ముందుగానే ఇక్కడికి వస్తారు.
సిడ్నీకి దగ్గరగానే సిడ్నీ ఒపేరా హౌస్‌ ఉంది. భవనం ఆకారాన్ని బట్టే ప్రత్యేకతను తెచ్చిపెట్టుకుంది. సాంస్కృతిక, పబ్లిక్‌ కార్యక్రమాల కోసం సిడ్నీ రాష్ట్ర ప్రభుత్వం 1973లో దీన్ని ప్రారంభించింది. మిలమిలా మెరిసే పదిలక్షల టైల్స్‌ని దీని కప్పుపై వాడారు. అవి 15 టన్నుల బరువున్నాయంట.యునెస్కో దీన్ని2007లో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది. ఏటా దాదాపుగా ఎనభై లక్షల మంది దీన్ని సందర్శిస్తున్నారు.