header

Thimpu City Bhutan.. థింపూ నగరం..

Thimpu  City  Bhutan.. థింపూ నగరం.. భూటాన్‌ దేశపు రాజధాని థింపూ నగరం వైశాల్యం 26 చదరపు కిలోమీటర్లు. జనాభా షుమారు లక్షకు పైగా ఉంటుంది. థింపూ భారతదేశానికి పక్కనే ఉన్న భూటాన్‌లోని అతి పెద్ద నగరం. వాంగ్‌ చూ నది వల్ల ఏర్పడ్డ లోయలో ఆహాలదకరంగా ఉంటుందీ నగరం.
భూటాన్‌లో రాచరికపాలన ఉంది. ఆ రాజవంశీయులు ఉండేది థింపూలోనే. నేషనల్‌ అసెంబ్లీ వంటి రాజకీయ భవనాలూ ఉండేది ధింపూలోనే. రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేంద్రం ఈ నగరం. పర్యాటక స్థలం కూడా
ఈ రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండదు. ఇక్కడి నుంచి 54 కిలోమీటర్ల దూరంలో పారో ఎయిర్‌పోర్టు ఉంటుంది.
ప్రపంచంలోనే ఎత్తయిన నగరాల్లో ఇదీ ఒకటి. సముద్రమట్టం నుంచి 2,334 మీటర్ల ఎత్తులో ఉంటుందిది. ఇక్కడ ఇంటర్నెట్‌, టీవీలు వచ్చింది 2001 నుంచే. నేషనల్‌ టెక్స్‌టైల్‌ మ్యూజియం, వీకెండ్‌ మార్కెట్‌, క్రాఫ్ట్‌ బజార్‌ వంటివీ ఇక్కడి మంచి పర్యాటక ప్రాంతాలు.
వరి, మొక్కజొన్న, గోధుమ పంటలు ఎక్కువగా సాగుచేస్తారు. 1960కి ముందు థింపూ పల్లెటూళ్ల సమూహంగా ఉండేది. 1961లో ఇది భూటాన్‌ రాజధాని మారింది. 1962 నుంచే ఈ నగరంలో వాహనాలు తిరగడం మొదలై అభివృద్ధి ఫధాన నడిచింది.
ఇక్కడ బౌద్ధమతస్థులే ఎక్కువ.ప్రపంచంలోని ఎత్తయిన బుద్ధ విగ్రహాల్లో ఒకటి ఈ నగరంలో ఉంటుంది. ఈ విగ్రహం ఇంచుమించు 170 అడుగుల పొడవు ఉంటుంది.
జాంగ్షీ హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ఫ్యాక్టరీకి సందర్శకులు వెళుతుంటారు. ఇందులో ప్రత్యేకమైన భూటానీస్‌ పేపర్‌ని తయారు చేస్తుంటారు. ఇప్పటికీ పురాతన పద్ధతులే వాడతారు.
జానపద వారసత్వాన్ని తెలిపే ఫోక్‌ హెరిటేజ్‌ మ్యూజియంలో ఇక్కడి జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశాల్ని ప్రదవర్శిస్తారు.
నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ భూటాన్‌ ప్రత్యేక ఆకర్షణ. భూటానీస్‌, టిబెటన్‌కు చెందిన 6100 పుస్తకాలు ఉంటాయి.
ఇతర దేశాలలోని నగరాల్లో ట్రాఫిక్‌ లైట్లు సాధారణమే. కానీ ఈ రాజధాని నగరంలో మాత్రం ఎక్కడా ట్రాఫిక్‌ లైట్లు కనిపించవు. ట్రాఫిక్‌ పోలీసులే వాహనాలు కంట్రోల్ చేస్తారు.